తెలంగాణ అసెంబ్లీ సెక్రటరీని మంగళవారం నాడు ఉదయం సస్పెన్షన్ కు గురైన బీజేపీ ఎమ్మెల్యేలు కలిశారు. హైకోర్టు తీర్పు కాపీని తీసుకొని కార్యదర్శిని కలిశారు.

హైదరాబాద్: Telangana Assembly secretaryని బీజేపీ ఎమ్మెల్యేలు మంగళశారం నాడు ఉదయం కలిశారు. శాసనసభ ప్రారంభం కావడానికి ముందే BJP ఎమ్మెల్యేలు సెక్రటరీని కలిశారు. శాసనసభ సమావేశాలకు ఇది చివరి రోజు. ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఉండాలని Telangana High Court అభిప్రాయపడింది. సస్పెన్షన్ ఎత్తివేతపై నిర్ణయం స్పీకర్‌దే అని తెలంగాణ హైకోర్టు సోమవారం నాడు అభిప్రాయపడింది. తమ ఆర్డర్ కాపీలతో Speaker ను కలవాలని కూడా హైకోర్టు ఆదేశించింది.

స్పీకరే సమస్యను పరిష్కరించే దిశగా నిర్ణయం తీసుకోవాలని పేర్కొంది. సభలో ప్రజాప్రతినిధులు వుంటేనే ప్రజాస్వామ్యం నిలబడుతుందని న్యాయస్థానం అభిప్రాయపడింది. అసెంబ్లీ వ్యవహారాల్లో న్యాయస్థానాలు కలగజేసుకోవచ్చన్నారు.

ఈ ఆర్డర్ కాపీతో సస్పెండైన బీజేపీ ఎమ్మెల్యేలు ముగ్గ్గురు ఇవాళ అసెంబ్లీ సెక్రటరీతో సమావేశమయ్యారు. హైకోర్టు ఆర్డర్ ను చూపారు. మరో వైపు ఈ విషయమై స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డితో కూడా సస్పెండైన బీజేపీ ఎమ్మెల్యేలు సమావేశం కానున్నారు.

తెలంగాణ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 7వ తేదీన ప్రారంభమయ్యాయి. ఈ సమావేశాల రోజున గవర్నర్ ప్రసంగం లేకుండా సమావేశాలు నిర్వహించడంపై బీజేపీ ఎమ్మెల్యేలు నిరసనకు దిగారు. మంత్రి హరీష్ రావు బడ్జెట్ ప్రసంగం చేస్తున్న సమయంలో బీజేపీ సభ్యులు నినాదాలు చేయడంతో వారిని ఈ సమావేశాలు పూర్తయ్యే వరకు సస్పెండ్ చేశారు.

బ‌డ్జెట్ ప్ర‌సంగానికి అడ్డుప‌డుతున్నారనే కారణంతో ఈట‌ల రాజేంద‌ర్, రాజా సింగ్, ర‌ఘునంద‌న్ రావును సస్పెండ్ చేశారు. శాస‌న‌స‌భ స‌మావేశాలు ముగిసే వ‌ర‌కు ఈ ముగ్గురిని స‌స్పెండ్ చేస్తున్న‌ట్లు స్పీక‌ర్ ప్ర‌క‌టించారు. స్పీకర్‌ జారీచేసిన సస్పెన్షన్‌ ఉత్తర్వులను కొట్టేసి సమావేశాలకు తమను అనుమతించేలా ఆదేశించాని బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్ రావు, రాజా సింగ్‌లు హైకోర్టును ఆశ్రయించారు. అయితే దాఖలు చేసుకున్న పిటిషన్‌ను కొట్టేసింది. అసెంబ్లీ స్పీకర్‌ జారీచేసిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకునేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ విషయమై డివిజన్ బెంచ్ ను బీజేపీ ఎమ్మెల్యేలు ఆశ్రయించారు.

ఈ విషయమై సోమవారం నాడు తెలంగాణ హైకోర్టు డివిజన్ చెంచ్ విచారణ చేసింది. జస్టిస్ ఉజన్ బయల్ బెంచ్ విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు తీసుకోవడం లేదని బీజేపీ ఎమ్మెల్యేలు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఈ క్రమంలోనే అసెంబ్లీ కార్యదర్శి నోటీసులు తీసుకోకపోవడంపై హైకోర్టు సీరియస్‌గా స్పందించింది. అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులు ఇవ్వాలని జ్యూడిషీయల్‌ రిజిస్ట్రార్‌ను హైకోర్టును ఆదేశించింది. అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులు చేరేలా చూడాలని రిజిస్ట్రార్ జనరల్, హైదరాబాద్‌ సీపీ స్వయంగా వెళ్లి నోటీసులు అందజేయాలని ఆదేశించింది. తదుపరి విచారణకు ఈ రోజు సాయంత్రం నాలుగు గంటలకు వాయిదా వేసింది. 

శాసనసభ వ్యవహారాల్లో జోక్యం చేసుకునే అధికారం న్యాయస్థానాలను లేదన్న అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ వాదనతో హైకోర్టు న్యాయమూర్తి షమీమ్‌‌ అక్తర్‌ ఏకీభవించారు. సభా కార్యక్రమాలకు మెంబర్‌‌ ఎవరైనా ఆటంకం కల్పిస్తే సస్పెండ్‌‌ చేసే అధికారం స్పీకర్‌‌కు ఉందన్నారు. న్యాయమూర్తి ఆదేశాల మేరకు ఈ కేసుకు సంబంధించి అసెంబ్లీ కార్యదర్శి, సెక్రటేరియట్‌ కార్యదర్శికి నోటీసులిచ్చేందుకు హైకోర్టు అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌ స్వయంగా వెళ్లినా అసెంబ్లీ ఆవరణలోకి అనుమతించలేదని రిజిస్ట్రా ర్‌ (జ్యుడీషియల్‌) న్యాయమూర్తికి నివేదిక సమర్పించారు.