తెలుగుదేశం పార్టీని వీడి బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్ రావుతో తెలంగాణ బీజేపీ నేతలు భేటీ అయ్యారు. శుక్రవారం గరికపాటితో వీరు సమావేశమయ్యారు. దేశరాజధాని ఢిల్లీలోని గరికపాటి నివాసానికి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్, ఎమ్మెల్యే రాజాసింగ్, ఎమ్మెల్సీ రామచంద్రరావు, మాజీ ఎమ్మెల్యేలు ఇంద్రసేనా రెడ్డి, చింతల రామ చంద్రారెడ్డి తదితర నాయకులు వెళ్లారు.

గురువారం రాజ్యసభ ఛైర్మన్ ఛాంబర్ కి వెళ్తూ.. గరికపాటి అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. బీపీ సడెన్ గా పడిపోవడంతో.. ఆయన ఒక్కసారిగా కుప్పకూలారు. పక్కనే ఉన్న సీఎం రమేష్, టీజీ వెంకటేష్ లు ఆయనను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.చికిత్స అనంతరం ఆయన ఇంటికి చేరారు.

ఈ క్రమంలో తెలంగాణ బీజేపీ నేతలు గరికపాటి ఇంటికి వెళ్లి మరీ పరామర్శించారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిస్థితులపైనా చర్చించినట్లు సమాచారం.