Asianet News TeluguAsianet News Telugu

ప్రధాని మోడీ ప్రసంగంపై ఒవైసీ విమర్శలు.. విజయశాంతి కౌంటర్

ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై విరుచుకుపడ్డారు తెలంగాణ బీజేపీ నేత విజయశాంతి. వ్యాక్సిన్ల అంశంపై నిన్న ప్రధాని నరేంద్ర మోడీ జాతినుద్దేశించి ప్రసంగించడాన్ని ఒవైసీ ఓ అనవసరం విషయంలా అభివర్ణించడంపై రాములమ్మ ఫైరయ్యారు.

telangana bjp leader vijayashanthi replies to asaduddin owaisi remarks on pm modi speech ksp
Author
Hyderabad, First Published Jun 8, 2021, 2:54 PM IST

ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీపై విరుచుకుపడ్డారు తెలంగాణ బీజేపీ నేత విజయశాంతి. వ్యాక్సిన్ల అంశంపై నిన్న ప్రధాని నరేంద్ర మోడీ జాతినుద్దేశించి ప్రసంగించడాన్ని ఒవైసీ ఓ అనవసరం విషయంలా అభివర్ణించడంపై రాములమ్మ ఫైరయ్యారు. దేశంలో 135 కోట్ల మంది జనాభా ఉన్నప్పుడు కొవిడ్ వ్యాక్సిన్ కొరత ఏర్పడడం సహజమే ఒవైసీ జీ... అంటూ ట్వీట్ చేశారు. ప్రపంచం మొత్తం దాదాపు ఇలాంటి పరిస్థితులే ఉన్నాయని విజయశాంతి వివరించారు.

Also Read:18 ఏళ్లు నిండిన వారందరికీ ఉచితంగా వ్యాక్సిన్:దేశ ప్రజలనుద్దేశించి మోడీ ప్రసంగం

ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవాలన్న నీతి సూత్రం మీ సయామీ కవల పార్టీ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కి చెప్పలేదా? అని ఆమె ప్రశ్నించారు. 2020 జూలైలోనే వ్యాక్సిన్‌కు ఆమోదం లభిస్తే, ఆ వ్యాక్సిన్ సంస్థకు ఆర్డర్ ఇవ్వకుండా ఏంచేస్తున్నారని విజయశాంతి నిలదీశారు. 25 శాతం ప్రైవేటు ఆసుపత్రులకు ఇవ్వడం వీఐపీ సంస్కృతి అయితే, టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యాక్సిన్ కొనుగోలు చేసే అవకాశం ఇవ్వాలని అడుగుతున్నది బ్లాక్ మార్కెట్ సంస్కృతి కోసమా? అని రాములమ్మ ట్విట్టర్ లో విమర్శించారు

 

 

Follow Us:
Download App:
  • android
  • ios