Asianet News TeluguAsianet News Telugu

నేను హారతి పడితే ఇప్పుడు జగన్ కు నువ్వు చేస్తుందేమిటి....: కేసీఆర్ పై డీకే అరుణ ఫైర్

గోదావరి నీటిపై ఏపీ సీఎం జగన్ తో మాట్లాడనని చెప్తున్న సీఎం కేసీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో తాను హారతిపట్టానని ప్రచారం చేసిన కేసీఆర్ అప్పుడు తప్పు ఇప్పుడు ఒప్పా అంటూ నిలదీశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తాను హారతి పట్టకపోయినా సెంటిమెంట్ లబ్ధికోసం హారతిపట్టినట్లు తప్పుడు ప్రచారం చేశావ్ అంటూ మండిపడ్డారు. 
 

telangana bjp leader dk aruna serious comments on cm kcr over palamuru project
Author
Hyderabad, First Published Aug 30, 2019, 5:35 PM IST

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు బీజేపీ నేత, మాజీమంత్రి డీకే అరుణ. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇష్టం వచ్చినట్లు విమర్శలు చేస్తే సహించేది లేదన్నారు. ముఖ్యమంత్రి అయితే ఏదిపడితే అది మాట్లాడతావా అంటూ తిట్టిపోశారు. 

పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పరిశీలనలో తనపై కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నీళ్లు జూరాల నుంచి ఫస్ట్ ఫేజ్ లో తీసుకోవాలనని తాను అంటే ఆ విషయాలను ప్రస్తావిస్తూ కేసీఆర్ పనికిమాలినోళ్లు, అవగాహన లేనోళ్లు అంటూ విమర్శిస్తారా అంటూ నిలదీశారు. 

ఇప్పటికీ తాను అన్న వ్యాఖ్యలకు కట్టుబడే ఉన్నానని చెప్పుకొచ్చారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జూరాల ఫస్ట్ ఫేజ్ లోనే నీళ్లు తీసుకెళ్లాలని చెప్పుకొచ్చారు. హెలికాప్టర్ లో గిరగిరా తిరిగి తాను అది చేశా ఇదిచేశానంటూ ఆకాశంలో ఉంటూ మాటలు మాట్లాడటం కాదని ఫీల్డ్ లో విజిట్ చేయాలన్నారు. 

జూరాలకు గోదావరి నీళ్లు తీసుకువస్తానని కేసీఆర్ చెప్పడం ఒక అబద్దమన్నారు. గోదావరి నీళ్లు ఎప్పుడు గద్వాలకు వస్తాయో, జూరాలకు ఎప్పుడు తీసుకువస్తాయో అందరికీ తెలుసునన్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై కేసీఆర్ పచ్చి అబద్ధాలు చెప్తున్నారంటూ విరుచుకుపడ్డారు. 

ఇంటికో ఉద్యోగం ఇచ్చాక పాలమూరు ప్రాజెక్టు నిర్మిస్తానని చెప్పిన కేసీఆర్ పాలమూరుకు వ్యతిరేకంగా కేసు వేసిన వ్యక్తిని పక్కన కూర్చోబెట్టుకున్నాడని విమర్శించారు. పాలమూరు-రంగారెడ్డి, నెట్టెంపాడు ప్రాజెక్టులు సాధించింది తానేనని డీకే అరుణ చెప్పుకొచ్చారు. 

గోదావరి నీళ్లు ఇప్పట్లో వచ్చేవి కావని డీకే అరుణ స్పష్టం చేశారు. గట్టు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి అక్కడ నుంచి నీరు జూరాలకు, పాలమూరు-రంగారెడ్డిలకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆ ప్రాజెక్టులను పూర్తి చేసిన తర్వాత మాట్లాడాలని నిలదీశారు. 

గోదావరి నీటిపై ఏపీ సీఎం జగన్ తో మాట్లాడనని చెప్తున్న సీఎం కేసీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. గతంలో తాను హారతిపట్టానని ప్రచారం చేసిన కేసీఆర్ అప్పుడు తప్పు ఇప్పుడు ఒప్పా అంటూ నిలదీశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తాను హారతి పట్టకపోయినా సెంటిమెంట్ లబ్ధికోసం హారతిపట్టినట్లు తప్పుడు ప్రచారం చేశావ్ అంటూ మండిపడ్డారు. 

ప్రస్తుతం రాయలసీమపై కేసీఆర్‌కు కొత్తగా ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందో చెప్పాలని నిలదీశారు. రాజకీయ స్వలాభం‌ కోసమే ఏపీ సీఎం జగన్‌తో కేసీఆర్ దోస్తీ చేస్తున్నాడంటూ మండిపడ్డారు డీకే అరుణ. 

Follow Us:
Download App:
  • android
  • ios