Asianet News TeluguAsianet News Telugu

అర్వింద్ ఇంటిపై దాడి... తెలంగాణ రావణ రాజ్యం సాగనివ్వం : కేసీఆర్‌పై తరుణ్‌చుగ్ ఆగ్రహం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ తరుణ్‌చుగ్. తెలంగాణలో రావణ రాజ్యాన్ని సాగనివ్వమని.. కేసీఆర్ అహంకారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని ఆయన స్పష్టం చేశారు. 

telangana bjp incharge tarun chugh fires on cm kcr over attack on mp dharmapuri arvind house
Author
First Published Nov 19, 2022, 9:22 PM IST

టీఆర్ఎస్ ప్రభుత్వం హింసాత్మక రాజకీయాలకు పాల్పడుతోందన్నారు బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇన్‌ఛార్జి తరుణ్ చుగ్. దాడులతో బీజేపీని భయపెట్టలేరని అన్నారాయన. కేసీఆర్ అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారని ఫైరయ్యారు తరుణ్ చుగ్. తెలంగాణలో రావణ రాజ్యాన్ని సాగనివ్వమని ఆయన స్పష్టం చేశారు. కేసీఆర్ అహంకారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని.. టీఆర్ఎస్ దాడులకు బీజేపీ భయపడదని తరుణ్‌చుగ్ అన్నారు. బీజేపీ కార్యకర్తలు నిజం చెప్పకుండా కేసీఆర్ అడ్డుకోలేరని.. అధికారం పోతుందని కేసీఆర్ అహంకారంగా వ్యవహరిస్తున్నారని ఆయన దుయ్యబట్టారు. 

అంతకుముందు శనివారం ఎంపీ ధర్మపురి అరవింద్‌ ఇంటికి వెళ్లిన బండి సంజయ్.. ఆయనను పరామర్శించారు. దాడికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎంపీ ధర్మపురి అరవింద్ ఇంటిపై దాడిని బీజేపీ తీవ్రంగా ఖండిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చెప్పారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణంచాయని అన్నారు. రాజకీయాల కోసం కేసీఆర్ సొంత బిడ్డను పావుగా వాడుకుంటున్నారని ఆరోపించారు. ఎంపీ అరవింద్ నివాసంపై దాడి ఘటనపై సీఎం కేసీఆర్ తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. 

Also Read:మాజీ నక్సలైట్లతో విపక్ష నేతలపై దాడులకు టీఆర్ఎస్ కుట్ర : ఈటల సంచలన వ్యాఖ్యలు

పోలీసుల సహకారంతో, వారి కనుసన్నల్లోనే ఈ దాడి జరిగిందని ఆరోపించారు. దాడి ఎందుకు చేయాల్సి వచ్చిందనే దానికి కారణం కూడా లేదన్నారు. దాడి జరిగిన సమయంలో అనారోగ్యంతో బాధపడుతున్న అరవింద్ తండ్రి డీఎస్ ఇంట్లో లేకపోవడం అదృష్టమన్నారు. వినాయకుడిపై, లక్ష్మీ అమ్మవారిపై, పవిత్రంగా భావించే తులసి మాతపై దాడి చేశారని అన్నారు.  దేవుళ్ల మీద నిజమైన హిందువులైతే దాడి చేయరని అన్నారు. దీనికి ముఖ్యమంత్రి కేసీఆర్ సమాధానం చెప్పాలని అన్నారు. ఇంటి మీద దాడి జరిగినందుకు కూడా అరవింద్ బాధపడటం లేదని.. దేవుళ్ల మీద జరిగినందుకు బాధపడుతున్నారని చెప్పారు. దీని గురించి హిందూ సమాజం ఆలోచన చేయాలని కోరారు. మహిళల గురించి మాట్లాడే అర్హత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు, ఆమె కుటుంబానికి లేదన్నారు. 

సీఎం కేసీఆర్‌కు, కల్వకుంట్ల కుటుంబానికి ఓటమి భయం పట్టుకుందని ఆరోపించారు. తెలంగాణను అల్లకల్లోలం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో టీఆర్ఎస్ దౌర్జన్యాలను సహించబోమని అన్నారు.  టీఆర్ఎస్ నేతలు ప్రజల్లో మళ్లీ సెంటిమెంట్ ను రగిల్చేందుకు ప్రయత్నించి విఫలమయ్యారని తెలిపారు. రాజకీయ నేతల ఇండ్లపై దాడులు చేయడం సరికాదన్నారు. దాడులు చేసిన టీఆర్ఎస్ కార్యకర్తలపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ పాలనకు ముగింపు పలికేందుకు ఎన్నికలు ఎప్పుడూ వస్తాయా అని తెలంగాణ ప్రజలు ఎదురుచూస్తున్నారని చెప్పారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios