Asianet News TeluguAsianet News Telugu

రెండు చోట్ల ఓటేశారు: కవితపై ఈసీకి బీజేపీ ఫిర్యాదు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. రెండు చోట్ల ఓటు వేశారని ఎస్ఈసీ దృష్టికి తీసుకెళ్లింది. కవితను డిస్‌ క్వాలిఫై చేయాలని ఈసీని బీజేపీ నేతలు కోరారు. 
 
telangana bjp complaint against trs mlc kalvakuntla kavitha ksp
Author
Hyderabad, First Published Dec 2, 2020, 4:57 PM IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. రెండు చోట్ల ఓటు వేశారని ఎస్ఈసీ దృష్టికి తీసుకెళ్లింది. కవితను డిస్‌ క్వాలిఫై చేయాలని ఈసీని బీజేపీ నేతలు కోరారు. 

బండి సంజయ్ కుమార్ రెండు సంవత్సరాలు ఎంపీగా ఉన్నా కరీంనగర్ అభివృద్ధిని పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు కవిత. బుధవారం కరీంనగర్ పర్యటనకు వచ్చిన ఆమెకు మంత్రి గంగుల కమలాకర్ స్వాగతం పలికారు.

అనంతరం నగరంలోని శివాలయం, కరీముల్లా ఆశ దర్గాలను కవిత సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. చాలా రోజుల తర్వాత కరీంనగర్ కు రావడం సంతోషంగా ఉందన్నారు.

శివాలయంలో గౌరీ మాత కు పూజలు చేయడం అదృష్టంగా భావిస్తున్నానని కవిత చెప్పారు. హైదరాబాద్ జిహెచ్ఎంసి ఎన్నికల్లో పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్తకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

కరీంనగర్ కు వచ్చిన ట్రిపుల్ ఐటీ కాపాడుకోకపోవడం బండి సంజయ్ దురదృష్టమని కవిత ఎద్దేవా చేశారు. జిహెచ్ఎంసి ఎన్నికల చరిత్రలోనే అత్యధిక పోలింగ్ జరిగిందని.. కానీ బీజేపీ నేతలు దీనిని తెలుసుకోకుండా టీఆర్ఎస్‌ని విమర్శించడం తగదని కవిత పేర్కొన్నారు. 

Follow Us:
Download App:
  • android
  • ios