హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మద్దతుగా బస్ భవన్ వద్ద జరిగిన నిరసన కార్యక్రమంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలంటూ జరుగుతున్న ఆందోళనకు తెలంగాణ బీజేపీ చీఫ్ లక్ష్మణ్ హాజరయ్యారు. 

ఆర్టీసీ కార్మికులకు మద్దతు పలికారు. ఆర్టీసీ కార్మికులతోపాటు లక్ష్మణ్ కూడా ధర్నాలో పాల్గొన్నారు. అయితే నిరసనకు అనుమతి లేదంటూ పోలీసులు ఆందోళన కారులను అడ్డుకున్నారు. నిరసనకారులను అరెస్ట్ చేశారు డా.లక్ష్మణ్. 

నిరసనలో పాల్గొన్న లక్ష్మణ్ తోపాటు బీజేపీ కార్యకర్తలను ఆర్టీసీ కార్మికులను పోలీసులు అరెస్ట్ చేశారు. లక్ష్మణ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు నారాయణగూడ పీఎస్‌కు తరలించారు.ఈ సమయంలో డా.లక్ష్మణ్ సొమ్మసిల్లి పడిపోయారు. 

అయితే లక్ష్మణ్‌ సొమ్మసిల్లిపడిపోవడంతో బీజేపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు డా.లక్ష్మణ్ ఆరోగ్యంపై బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డా ఫోన్ చేసి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.