స్వామిగౌడ్‌కు టీఆర్ఎస్‌లో అన్యాయం జరిగిందన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్. భవిష్యత్తులో అనేక మంది పార్టీలో చేరుతారని ఆయన చెప్పారు.

చలాన్లపై సీఎం కేసీఆర్ వక్రీకరించారని.. ట్రిపుల్ రైడింగ్ చేయాలని కానీ, సిగ్నల్స్ దాటాలని కానీ ఎక్కడా చెప్పలేదని సంజయ్ వెల్లడించారు. కొంతమంది యువతపై కావాలనే అక్రమ చలానాలు వేస్తున్నారని ఆయన మండిపడ్డారు.

Also Read:జిహెచ్ఎంసీ ఎన్నికలు: స్వామి గౌడ్ తో బండి సంజయ్, లక్ష్మణ్ భేటీ

అలాంటి వారివే తాము చెల్లిస్తామని.. మోటార్ వెహికల్ యాక్ట్‌ను వ్యతిరేకించడం లేదని సంజయ్ పేర్కొన్నారు. స్వామిగౌడ్ హిందుత్వ భావజాలం ఉన్న వ్యక్తని.. స్వయం సేవక్‌గా చేశారని గుర్తుచేశారు.

స్నేహ పూర్వకంగానే స్వామిగౌడ్‌ను కలిశామని ప్రజలంతా టీఆర్ఎస్‌ను చూసి ఇబ్బందులు పడుతున్నారని సంజయ్ స్పష్టం చేశారు. టీఆర్ఎస్‌లో సరైన స్థానం లభించనందునే చాలా మంది మమ్మల్ని సంప్రదిస్తున్నారని పేర్కొన్నారు. కొత్తగా వలసల వల్ల కార్యకర్తలకు ఎవరికి అన్యాయం జరగదని బండి సంజయ్ హామీ ఇచ్చారు.