ఢిల్లీ లిక్కర్ కేసును డైవర్ట్ చేయడానికే కేసీఆర్ ఫామ్‌హౌస్ డ్రామా ఆడారని ఆరోపించారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్. మొయినాబాద్ ఫామ్‌హౌస్ స్క్రిప్ట్ అంతా ఢిల్లీలోనే తయారైందన్నారు. 

మొయినాబాద్ ఫామ్‌హౌస్ స్క్రిప్ట్ అంతా ఢిల్లీలోనే తయారైందన్నారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఈ ఎపిసోడ్ అంతా ఓ పెద్ద డ్రామా అన్నారు. ఢిల్లీ లిక్కర్ కేసును డైవర్ట్ చేయడానికే ఈ డ్రామా అని సంజయ్ ఆరోపించారు. ఆ ముగ్గురు నకిలీ గ్యాంగ్‌ను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారని ఆయన తెలిపారు. 

అంతకుముందు న్యూఢిల్లీలో శుక్రవారంనాడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తమ పార్టీ ఎమ్మెల్యేలపైనే కేసీఆర్ కు విశ్వాసం లేదన్నారు. తాండూరు ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి ఏమైనా నీతివంతుడా అని ఆయన ప్రశ్నించారు. ఫాంహౌస్ ఘటనలో పాల్గొన్న నలుగురు ఎమ్మెల్యేల్లో ముగ్గురు ఎమ్మెల్యేలు ఏ పార్టీ నుండి వచ్చారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. ఫాంహౌస్ వీడియోల పేరుతో కేసీఆర్ పాత రికార్డును తిరగేశారని కిషన్ రెడ్డి ఎద్దేవా చేశారు. నిన్నటి సీఎం మీడియా సమావేశంలో వీడియోల ప్రదర్శనలు కొండను తవ్వి ఎలుకను పట్టినట్టుగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు.

ALso Read:టీఆర్ఎస్ సర్కార్ ను కూల్చాలని అనుకోలేదు:కేసీఆర్ కి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి కౌంటర్

తమ పార్టీలో చేర్చుకోవాలంటే తమ పార్టీ నేతలే నేరుగా ఎమ్మెల్యేలతో మాట్లాడుతారన్నారు. కానీ స్వామిజీలను మధ్యవర్తులుగా పెట్టుకొని మాట్లాడాల్సిన అవసరం తమకు లేదన్నారు. మీ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాల్సిన అవసరం తమకు ఏమీ లేదని కిషన్ రెడ్డి చెప్పారు. బ్రోకర్లను మధ్యలో పెట్టి ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాల్సిన ఖర్మ తమకు పట్టలేదని ఆయన చెప్పారు. నెలలో 15 రోజులు ఫాంహౌస్ లో ఉండే కేసీఆర్ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతారా అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు. సామాన్యులను ఎప్పుడైనా కలిశారా అని కేసీఆర్ ను ఆయన అడిగారు.ఫాంహౌస్ లో ఆర్ఠిస్టులు కూర్చొని అందమైన అబద్దాన్ని వీడియోలో చూపించారన్నారు.పార్టీలో చేర్చుకొనేందుకు తమకు స్వామిజీలు అవసరమా అని ఆయన అడిగారు. గతంలో తమ పార్టీలో చేరినవారు స్వామిజీలు లేదా మధ్యవర్తుల ద్వారా చేరారా అని కిషన్ రెడ్డి ప్రశ్నించారు.

వచ్చే ఎన్నికల వరకు తాము ఎదురు చూస్తామన్నారు. తమకు ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారన్నారు.మనుగోడులో కోమటిరెడ్డి విజయంతో తమ ఎమ్మెల్యేల సంఖ్య నాలుగుకి చేరుతుందని కిషన్ రెడ్డి చెప్పారు.సీబీఐను అడ్డుకొనేందుకు పాత తేదీలతో కేసీఆర్ సర్కార్ జీవోలు తెచ్చిందన్నారు. జయప్రకాష్ నారాయణ గురించి మాట్లాడే నైతికత కేసీఆర్ కు లేదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెప్పారు.