గుర్రంపోడులో భూకబ్జాలతో పాటు గిరిజనులపై అక్రమంగా కేసులు పెట్టారని ఆరోపించారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గిరిజనులకు భరోసా ఇవ్వడానికే బీజేపీ తండాలోకి వెళ్లిందని బండి స్పష్టం చేశారు. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

గాయాలపాలైన పోలీసులకు క్షమాపణలు కూడా చెప్పామని.. అయినప్పటికీ బీజేపీ కార్యకర్తలను హింసిస్తున్నారని సంజయ్ మండిపడ్డారు. నాగార్జున సాగర్ బహిరంగసభలో బీజేపీ కార్యకర్తలను వదిలిపెట్టొద్దని కేసీఆర్ చెప్పారని ఆయన గుర్తుచేశారు.

ప్రభాకర్ రావు ఆస్తులు అన్నీ బయటపెడతామని.. కేసీఆర్ కొంప ముంచేది ప్రభాకర్ రావేనని బండి సంజయ్ పేర్కొన్నారు. నాగార్జున సాగర్‌లో గిరిజనులే టీఆర్ఎస్‌కు బుద్ది చెబుతారని.. శాంతి భద్రతకు సమస్యలొస్తే బాధ్యత ప్రభుత్వానిదేనని ఆయన స్పష్టం చేశారు.