తెలంగాణ రాష్ట్ర న్ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి విరుచుకుపడ్డారు.  హిందూ సమాజానికి వ్యతిరేకంగా కేసీఆర్ ప్రవర్తిస్తున్నాడంటూ ఆయన ధ్వజమెత్తారు. రంజాన్ సమయంలో కేసులను తగ్గించి చూపించిన సర్కార్ హిందువుల పండగైన వినాయక ఉత్సవాల సందర్భంగా పెరిగాయని చెప్పడం.... హిందూ సమాజం ;పై చేస్తున్న కుట్ర అని ఆయన నిప్పులు చెరిగారు. 

గత మూడు రోజులుగా వినాయక నిమజ్జనాలకు కూడా అడ్డుకుంటున్నారని, రంజాన్ సందర్భంగా కేసులను తగ్గించి చూపే ప్రయత్నం చేసిన కేసీఆర్ సర్కార్..... ఇప్పుడు గణేష్ నవరాత్రుల సందర్భంగా ఎందుకు కేసులను పెంచి చూపించే ప్రయత్నం చేస్తున్నారో ప్రజలకు వివరించాలని ఆయన డిమాండ్ చేసారు. 

కేసీఆర్ సర్కార్ ఎన్నో అక్రమాలు అవినీతికి పాల్పడుతుందని ఆయన ఆరోపించారు. ప్రాజెక్టుల అంచనాలను పెంచుతూ, కమీషన్లు తీసుకుంటూ కేసీఆర్ కుటుంబం, అక్రమాలకు తెగబడుతోందని, కంపెనీలకు వారి కుటుంబం దాసోహమైందని ఆయన వ్యాఖ్యానించారు. 

కేసీఆర్ అవినీతిపై కేంద్రం డేగ కన్ను వేసిందని, ఆర్ధిక లావాదేవీలన్నిటిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తుందని, త్వరలోనే కేసీఆర్ జైలుకెళ్ళటం ఖాయమని బండి సంజయ్ అన్నారు. 

జాం పాలనను తలపిస్తూ కేసీఆర్‌ హయాంలో హిందూ సమాజంపై ఆంక్షలు, నిర్బంధాలు విధిస్తున్నారని సంజయ్ దుయ్యబట్టారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిందని, అరాచక పాలన కొనసాగుతోందని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. 

కరోనా కట్టడిలో రాష్ట్ర పభ్రుత్వం పూర్తిగా విఫలమై చేతులెత్తేసిందని, సీఎం పట్టించుకోకపోవడంతో పేదలు ప్రాణాలు కోల్పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేసారు. ఈ విషయాన్ని గవర్నర్‌ ప్రస్తావించగా, రాజ్యాంగబద్ధమైన స్థాయిలో ఉన్న ఆమెను సైతం విమర్శించే స్థాయికి టీఆర్‌ఎస్‌ దిగజారిందని సంజయ్ దుయ్యబట్టారు. అంతకుముందు పలు సందర్భాల్లో గవర్నర్‌ లేఖలు రాసినప్పటికీ..... ముఖ్యమంత్రి ఎందుకు స్పందించలేదని ఆయన నిలదీశారు.

కరోనా పేరిట తెలంగాణలోని కార్పొరేట్‌ ఆస్పత్రులు పేదలను దోచుకుంటున్నాయని..... అయినప్పటికీ ప్రభుత్వం చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తోందని ఆయన అన్నారు. 

ఇచ్చిన హామీలను తెలంగాణ సర్కార్ విస్మరించడం వల్ల వివిధ వారాగాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బండి సంజయ్ అన్నారు. నిరుద్యోగ భృతి అనే అంశాన్నే సర్కార్ పక్కకు పెట్టేసిందని ఆయన దుయ్యబట్టారు. 

ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లను ప్రభుత్వం మోసం చేసిందని, రాష్ట్రంలోని కౌలు రైతులకు రైతుబంధు ఇవ్వడంలేదని, కేంద్రం నిర్వహించే వీడియో కాన్ఫరెన్స్‌ల్లో కేసీఆర్‌ మాట్లాడేది ఒకటైతే.. తర్వాత రాష్ట్ర మంత్రులు కేంద్రం మెచ్చుకుందని పేర్కొంటూ తప్పుడు ప్రకటనలు చేస్తున్నారని..... ఎందుకిలా ప్రవర్తిస్తున్నారో ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేసారు.  

2023లో తెలంగాణలో అధికారం బీజేపీదే అని ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. కొత్త కమిటీలు నియమించక తొలిసారి నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేసారు.