Asianet News TeluguAsianet News Telugu

వామన్ రావు దంపతుల హత్య.. రేపు ఛలో మంథనికి సంజయ్ పిలుపు

బీజేపీ నేతలతో శనివారం తెలంగాణ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ సమావేశమయ్యారు. ఆదివారం 200 మంది న్యాయవాదులతో ఆయన ఛలో మంథని కార్యక్రమానికి పిలుపునిచ్చారు. 

telangana bjp called for chalo manthani over vamanrao couple murder case ksp
Author
Hyderabad, First Published Feb 20, 2021, 4:50 PM IST

బీజేపీ నేతలతో శనివారం తెలంగాణ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ సమావేశమయ్యారు. ఆదివారం 200 మంది న్యాయవాదులతో ఆయన ఛలో మంథని కార్యక్రమానికి పిలుపునిచ్చారు.

ఇందుకోసం రాష్ట్ర ఆఫీసు నుంచి 4 బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. వామన్ రావు హత్య కేసుపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు. రేపు ఛలో మంథనిలో భాగంగా వామన్ రావు కుటుంబసభ్యులను బీజేపీ లీగల్ సెల్ పరామర్శించనుంది. 

Also Read:నేను వజ్రాన్ని.. నాపై ఎందుకీ కుట్రలు: వామన్‌రావు దంపతుల హత్యపై పుట్టా మధు స్పందన

కాగా నిన్న మీడియాతో మాట్లాడిన బండి సంజయ్ రాష్ట్రంలో గుండా రాజకీయాన్ని పెంచి పోషిస్తున్నారంటూ ఫైరయ్యారు. అవినీతిని ప్రశ్నిస్తున్నందుకే ఆయనపై హత్య చేసి చంపేశారు అని బండి సంజయ్ అన్నారు.

వామన్ రావు హత్యపై హైకోర్టు సుమోటోగా కేసు స్వీకరించి కుటుంబానికి న్యాయం చేయాలి. సిట్టింగ్ జడ్జితో ప్రత్యేక విచారణ చేయాలని డిమాండ్ చేశారు. కనీసం హత్యపై స్పందించాల్సిన మానవత్వం కూడా కేసీఆర్ కు లేదా? అని ప్రశ్నించారు బండి. 

Follow Us:
Download App:
  • android
  • ios