హైదరాబాద్: ఈటల రాజేందర్ మేకవన్నె పులి అని తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్  విమర్శించారు.మంగళవారంనాడు తెలంగాణ రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్  హైద్రాబాద్ టీఆర్ఎస్ భవన్ లో మీడియాతో మాట్లాడారు. పదవి ఉన్నప్పుడు ఈటలకు బీసీలు గుర్తుకు రాలేదా అని ఆయన ప్రశ్నించారు. బీసీ ముసుగులో ఉన్న పెద్ద దొర ఈటల రాజేందర్ అని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో ఎప్పుడైనా ముదిరాజుల కోసం ఈటల మాట్లాడారా అని ఆయన ప్రశ్నించారు. హుజూరాబాద్‌లో బీసీ, హైద్రాబాద్‌లో మాత్రం ఈటల రాజేందర్ ఓసీ అని ఆయన విమర్శించారు.

also read:ఆత్మగౌరవం ఎక్కడ దెబ్బతిందో చెప్పాలి: ఈటలకు కొప్పుల ప్రశ్న

వేల ఎకరాల భూములు అనతి కాలంలోనే ఎలా సంపాదించావని  ఆయన ప్రశ్నించారు. పార్టీలో, ప్రభుత్వంలో కీలకంగా ఉన్నందునే వీటిని అడ్డుపెట్టుకొని సంపాదించావని ఆయన విమర్శించారు.  తనకు తాను ఈటల రాజేందర్ ఎక్కువగా ఊహించుకొన్నాడని ఆయన ఆరోపించారు. అతి తక్కువ సమయంలోనే అంబానీ కూడ సంపాదించలేదని కానీ ఈటల రాజేందర్ మాత్రం వేల కోట్లు సంపాదించాడన్నారు. విపక్షాలకు చెందిన నేతలతో సన్నిహితంగా ఉండేవాడని తమ పార్టీ వారితో అంటీముట్టనట్టుగా ఉండేవాడని ఆయన గుర్తు చేశారు. కేసీఆర్ బొమ్మ, టీఆర్ఎస్ గుర్తుపై  హుజూరాబాద్‌లో విజయం సాధించినట్టుగా ఆయన చెప్పారు. పార్టీ బలంగా ఉన్నందునే ఆరు దఫాలు విజయం సాధించారన్నారు. ఈ గెలుపు ఈటల రాజేందర్ గొప్పతనం కాదన్నారు.