ఈ నెల 6 నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు

ఈ నెల 6వ తేదీ నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సమావేశాలు ప్రారంభమైన రోజున నిర్వహించే బీఏసీ సమావేశాల్లో ఎన్ని రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలనే దానిపై చర్చించి నిర్ణయం తీసుకొంటారు.

Telangana Assembly Sessions  likely to  begin From september 06

హైదరాబాద్: ఈ నెల 6వ తేదీ నుండి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 3న నిర్వహించే కేబినెట్ సమావేశాల్లో అసెంబ్లీ సమావేశాల పై చర్చించనున్నారు.ఈ నెల 6వ తేదీన ఉదయం పదకొండున్నర గంటలకు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 15 రోజుల పాటు  అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తుంది. 

రాష్ట్రంలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలపై చర్చకు విపక్షాలు పట్టుబట్టే అవకాశం ఉంది. బీజేపీ శాసనసభపక్షనేత రాజాసింగ్ పై  పీడీయాక్ట్ ను నమోదు చేసి జైలుకు తరలించిన విషయం తెలిసిందే. రాజాసింగ్ ను అసెంబ్లీ నుండి బహిష్కరించాలని ఎంఐఎం డిమాండ్ చేసింది.ఈ విషయమై కూడా చర్చించే అవకాశాలు లేకపోలేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అసెంబ్లీ వేదికగా బీజేపీ తీరును టీఆర్ఎస్ ఎండగట్టనుంది. రాష్ట్రంలో ప్రజల సమస్యలపై విపక్షాలు ప్రభుత్వ తీరును ప్రశ్నించనున్నాయి. 

ఈ నెల మూడో తేదీన తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది.ఈ సమావేశంలో అసెంబ్లీలో ప్రవేశ పెట్టే బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. అదే రోజు సాయంత్రం తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ఎల్పీ సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాలతో పాటు దేశంలో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల్లో టీఆర్ఎస్ అనుసరించనున్న పాత్రపై టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులకు కేసీఆర్ దిశానిర్ధేశం చేయనున్నారు.

వచ్చే ఎన్నికల్లో దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించాలని టీఆర్ఎస్ చీఫ్ భావిస్తున్నారు. ఈ మేరకు  కాంగ్రెస్, బీజేపీయేతర పార్టీల నేతలు, సీఎంలను కలుస్తున్నారు. గత వారంలోనే  బీహర్ సీఎం నితీష్ కుమార్ తో భేటీ అయ్యారు. త్వరలోనే యూపీకి కూడా సీఎం వెళ్లే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతుంది. ఈ పరిణామాలపై టీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో కేసీఆర్ వివరించున్నారు.


 


 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios