Asianet News TeluguAsianet News Telugu

Telangana Assembly Election Result 2023 : మధ్యాహ్నం వరకు తాజ్ కృష్ణకు గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు...

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాల పరిశీలకులుగా హైదరాబాదులో  డీకే శివకుమార్, కర్ణాటక మంత్రి జార్జ్ లు ఉన్నారు. 

Telangana Assembly Election Result 2023 : Congress MLAs who won for Taj Krishna till noon - bsb
Author
First Published Dec 3, 2023, 8:25 AM IST

హైదరాబాద్ : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు మొదలయ్యింది. గెలుపెవరిదో తేలడానికి ఇంకా కొద్ది గంటల సమయమే ఉంది. ఈ నేపథ్యంలో ఆదివారం రాత్రికి కాంగ్రెస్ ఎల్పీ సమావేశం జరగనుంది. మధ్యాహ్నం వరకు హోటల్ తాజ్ కృష్ణకు గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తరలించనున్నారు. హైదరాబాదులో పరిశీలకులుగా డీకే శివకుమార్, కర్ణాటక మంత్రి జార్జ్ లు ఉన్నారు. 49 కేంద్రాల్లో తెలంగాణ కౌంటింగ్ జరుగుతోంది.  ఒక్కో రౌండ్ కు 15 నిమిషాల సమయం పడుతుందని సమాచారం. 

మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం రెండు లక్షల 20వేల పోస్టల్ బ్యాలెట్  ఓట్లు వచ్చాయి. వీటి లెక్కింపును 8:30 కల్లా పూర్తి చేసి, 8:30 నుంచి ఈవీఎంలలో పోలైన ఓట్లను లెక్కిస్తారు. మధ్యాహ్నం 10:30- 11 కల్లా తొలి రౌండ్ ఫలితం వెలువడే అవకాశం ఉంది. హైదరాబాదులోని చార్మినార్ నియోజకవర్గంలో ఫలితం మొదట వెలువడుతుందని సమాచారం.  కరీంనగర్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో బండి సంజయ్ ముందంజలో ఉన్నారు.

Follow Us:
Download App:
  • android
  • ios