తెలంగాణ అసెంబ్లీ నిరవధికంగా వాయిదా పడింది. ఇవాళ మధ్యాహ్నం తెలంగాణ అసెంబ్లీ ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలిపింది.

హైదరాబాద్: ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలిపిన తర్వాత తెలంగాణ అసెంబ్లీ మంగళవారం నాడు మధ్యాహ్నం నిరవధికంగా వాయిదా పడింది. ఏడు రోజుల పాటు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరిగాయి.

ఈ నెల 7వ తేదీన Telangana Assembly బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఇవాళ ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోదం తెలిపిన తర్వాత శాసనసభ నిరవధికంగా వాయిదా పడింది. 54 గంటల 47 నిమిషాల పాటు అసెంబ్లీ పని చేసింది.మొత్తం 4 బిల్లులకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది.

ద్రవ్య వినిమయ బిల్లును ఇవాళ సీఎం KCR సభలో ప్రవేశ పెట్టారు. ఈ బిల్లుపై చర్చ సందర్భంగా ఇతర పార్టీల సభ్యులు సందేహాలకు సీఎం కేసీఆర్ సమాధానమిచ్చారు.