IIIT-Basar campus: క్యాంపస్‌లోని గేట్ల వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు నిర్వహించి ఎవరినీ లోపలికి అనుమతించకుండా విద్యార్థులను బంధించగా, విద్యార్థులకు మద్దతు తెలిపేందుకు హైదరాబాద్ నుంచి బాసర ఐఐఐటీ క్యాంపస్ కు చేరుకుంటున్న రాజకీయ పార్టీ నేతలను పోలీసులు అరెస్టు చేస్తున్నారు.
Telangana: తాము ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు క్యాంపస్‌ను సందర్శించి తమ ఆందోళనను ముగించాలని కోరుతూ ఐఐఐటీ బాసర్‌లోని విద్యార్థులు శుక్రవారం నాల్గవ రోజు తమ ఆందోళనను కొనసాగించారు. శనివారం కూడా వారు నిరసనలను తెలుపుతున్నారు. క్యాంపస్‌లోని గేట్ల వద్ద కట్టుదిట్టమైన బందోబస్తు నిర్వహించి ఎవరినీ లోపలికి అనుమతించకుండా విద్యార్థులను బంధించగా, విద్యార్థులకు మద్దతు తెలిపేందుకు హైదరాబాద్ నుంచి బాసర ఐఐఐటీ క్యాంపస్ కు చేరుకుంటున్న రాజకీయ పార్టీ నేతలను పోలీసులు అరెస్టు చేస్తున్నారు. విద్యార్థులకు మద్దతు తెలుపుతూ.. బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్ లోనికి ప్రవేశించడానికి ప్రయత్నించిన పలువురు రాజకీయ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకన్నారు. వారిలో రాష్ట్ర బీజేపీ, కాంగ్రెస్ అధ్యక్షులు కూడా ఉన్నారు.
కామారెడ్డి జిల్లా బిక్నూర్ సమీపంలో భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకుడు, పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్‌కుమార్ అరెస్ట్ కాగా, పోలీసుల కళ్లు కప్పి క్యాంపస్ వద్దకు చేరుకున్న రేవంత్ రెడ్డిని చివరి నిమిషంలో పోలీసులు అరెస్టు చేశారు. బాసర ఐఐఐటీకి వెళ్లే అన్ని రహదారులపై పోలీసులు గట్టి నిఘా ఉంచడంతో, రేవంత్ రెడ్డి మోటారుసైకిల్, ట్రాక్టర్‌పై ప్రయాణించడంతోపాటు పలు రవాణా మార్గాలను ఉపయోగించారు, ఆపై పోలీసులు అడ్డుకోకుండా రోడ్ల నుండి కొంత దూరం నడిచారు. అయితే, క్యాంపస్‌కు చేరుకోగానే అతడిని కూడా పట్టుకుని అరెస్టు చేశారు.ఆందోళన చేస్తున్న విద్యార్థులు కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మద్దతు తెలుపుతూ ట్వీట్ చేశారు.
తమ సమస్యల పరిష్కరించాలంటూ ఆందోళనకు దిగిన బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు జనసేన నాయకుడు, నటుడు పవన్ కళ్యాణ్ సైతం మద్దతు తెలిపారు. అలాగే, అనేక ఇతర విద్యార్థి సంఘాలు కూడా విద్యార్థులకు మద్దతు ప్రకటించాయి. తమ ఆందోళన పూర్తిగా శాంతియుతమైనదని, అయితే తమతో మాట్లాడి తమ సమస్యలను పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు (కేటీఆర్) లేదా ఐటీ శాఖ మంత్రి కేటీ. రామారావు (కేటీఆర్) క్యాంపస్ (IIIT-Basar) కు వచ్చే వరకు తాము ఆందోళన విరమించేది లేదని ఆందోళన చేస్తున్న విద్యార్థులు తెలిపారు. ఇదిలావుండగా, మొదటి సంవత్సరం విద్యార్థుల తల్లిదండ్రులు.. వారి పిల్లల యోగక్షేమాలను గురించి ఆరా తీయడానికి క్యాంపస్‌కు లైన్ కట్టారు.
ఐఐఐటీ బాసర్‌పై ప్రభుత్వం దృష్టి సారించి ఉంటే ప్రస్తుత పరిస్థితులు తలెత్తి ఉండేవికావనీ, ముఖ్యమంత్రి పర్యటనకు ఎందుకు సమయం దొరకడం లేదని బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్ ప్రశ్నించారు. రాష్ట్రంలోని ఐఐఐటీ బాసర విద్యార్థులు, నిరుద్యోగ యువత ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించేందుకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే శాసనసభ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసి అన్ని యూనివర్సిటీలతో పాటు బాసర ఐఐఐటీలో బోధన, బోధనేతర సిబ్బందిని భర్తీ చేయండతో పాటు విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరారు. ప్రభుత్వం వెంటనే విద్యార్థుల సమస్యలను పరిష్కరించడానికి చర్యలు తీసుకోవాలని అన్నారు.
