Asianet News TeluguAsianet News Telugu

జలవివాదం మీద సీజే ధర్మాసనమే విచారించాలి : ఏజీ

కృష్ణానది జల విద్యుత్ ఉత్సత్తి వివాదం మీద తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) ధర్మాసనమే విచారణ చేపట్టాలని తెలంగాణ అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కోరారు. నదీ జలాల అంశం రోస్టర్ ప్రకారం సీజే ధర్మాసనానిక వస్తుందని తెలిపారు. ఈ విషయాన్ని సీజే వద్ద ప్రస్తావించినట్లు వివరించారు. 

telangana ag asks cj tribunal inquire the water dispute - bsb
Author
Hyderabad, First Published Jul 6, 2021, 12:09 PM IST

కృష్ణానది జల విద్యుత్ ఉత్సత్తి వివాదం మీద తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజే) ధర్మాసనమే విచారణ చేపట్టాలని తెలంగాణ అడ్వొకేట్ జనరల్ (ఏజీ) కోరారు. నదీ జలాల అంశం రోస్టర్ ప్రకారం సీజే ధర్మాసనానిక వస్తుందని తెలిపారు. ఈ విషయాన్ని సీజే వద్ద ప్రస్తావించినట్లు వివరించారు. 

ప్రస్తుతం విచారణ జరుపుతున్న ధర్మాసనానికి ఈ సమాచారం ఇవ్వాలని జస్టిస్ రామచంద్రరావు బెంచ్ కు ఏజీ తెలిపారు. రోస్టర్ పై అభ్యంతరాలు రామచంద్రరావు బెంచ్ దృష్టికి తీసుకెళ్లాలని సీజే చెప్పినట్లు ఏజీ ఆ బెంచ్ కు వివరించారు. 

కాగా, తెలంగాణలో విద్యుత్ కేంద్రాల్లో వంద శాతం ఉత్పత్తి చేయాలన్న ప్రభుత్వ ఉత్తర్వులను సవాల్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రైతులు హైకోర్టులో పిటిషన్ వేశారు. జూన్ 28వ తేదీన జీవో నెంబర్ 34 విడుదల చేసిన ప్రభుత్వం జీవో మీద రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ హై కోర్టులో పిటిషన్ వేశారు.

ఏపీ పునర్విభజన చట్టానికి వ్యతిరేకంగా జీవో నెంబర్ 34 తెలంగాణ ప్రభుత్వం తీసుకువచ్చిందంటూ పిటిషనర్లు అభ్యంతరం తెలిపారు. సాగునీటికి ఉపయోగించాల్సిన నీటిని విద్యుత్ ఉత్పత్తికి వినియోగిస్తున్నారని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. అలా చేయడం ద్వారా నీరు నిరుపయోగంగా సముద్రం పాలవుతుందని పిటిషనర్లు తెలిపారు. 

Follow Us:
Download App:
  • android
  • ios