కాలేజీల్లో నిర్ణయించిన ఫీజుల కంటే ఎక్కువ వసూలు చేస్తే జరిమానా విధిస్తామని కాలేజీలను హెచ్చరించింది తెలంగాణ ఫీజ్ రెగ్యులేటరీ కమిటీ. అదనంగా వసూలు చేసినట్లు తేలితే రూ.2 లక్షల ఫైన్ విధిస్తామని హెచ్చరించింది.
కాలేజీల్లో నిర్ణయించిన ఫీజుల కంటే ఎక్కువ వసూలు చేస్తే జరిమానా విధిస్తామని కాలేజీలను హెచ్చరించింది తెలంగాణ ఫీజ్ రెగ్యులేటరీ కమిటీ. ఏఎఫ్ఆర్‌సీ నిర్ణయించిన ఫీజుల కంటే ఎక్కువ వసూలు చేయరాదని సూచించింది. అదనంగా వసూలు చేసినట్లు తేలితే రూ.2 లక్షల ఫైన్ విధిస్తామని హెచ్చరించింది. ఎంతమంది దగ్గర వసూలు చేస్తే అన్ని రెండు లక్షలు కాలేజీలు కట్టాలని సూచించింది. బీ కేటగిరీ అడ్మిషన్ల కోసం పంపిన విద్యార్ధుల దరఖాస్తులు కాలేజీలకు అందడం లేదన్న దానిపై కమిటీ సీరియస్ అయ్యింది. దరఖాస్తులను ఆయా కాలేజీలు మెరిట్‌పై పరిగణించకపోతే చర్యలు తప్పవని హెచ్చరించింది.
