Asianet News TeluguAsianet News Telugu

కరోనా‌: తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు

కరోనా కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో వైద్య సదుపాయాలను పెంచాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది ఏపీ హైకోర్టు. ఆసుపత్రుల్లో సౌకర్యాలు మెరుగుపర్చాలని కూడా ప్రభుత్వం ఆదేశించింది.
 

Telagana High Court key orders on Corona
Author
Hyderabad, First Published Jan 7, 2022, 3:13 PM IST

హైదరాబాద్: Corona కేసులు పెరుగుతున్న దృష్ట్యా చిన్నారుల కోసం వైద్య సదుపాయాలను పెంచాలని Telangana High Court  రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టు శుక్రవారం నాడు విచారణ నిర్వహించింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై  పలు సూచనలు చేసింది ఉన్నత న్యాయస్థానం..

కరోనా విషయంలో కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలని రాష్ట్రాన్ని కోరింది. జనం గుమికూడకుండా మాల్స్, సినిమా థియేటర్లతో పాటు షాపింగ్ కాంప్లెక్స్ వద్ద జాగ్రత్తలు తీసుకోవాలని కోర్టు సూచించింది. వారాంతపు సంతల్లో కోవిడ్ నిబంధనలు అమలు చేయాలని కోరింది.

తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు రోజు రోజుకి పెరిగిపోతున్నాయి. దీంతో రాష్ట్రంలో విద్యా సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 8 నుండి 16వ తేదీ వరకు సెలవులు ప్రకటించింది. మరో వైపు రాష్ట్రంలో కరోనా నిర్ధారణ పరీక్షలను పెంచింది.   మరోవైపు రాష్ట్రంలో కరోనా ఆంక్షలను కూడా రాష్ట్ర ప్రభుత్వం  ఈ నెల 10వ తేదీ వరకు అమల్లో ఉంటాయని  ప్రకటించింది.

మరో వైపు దేశంలో కూడా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. దేశంలో కరోనా కేసులు లక్షను దాటాయి. కరోనా ఒమిక్రాన్ కేసులు 3,007కి చేరుకొన్నాయి. దేశంలోని మహారాష్ట్రలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. దేశంలో నమోదౌతున్న కేసుల్లో  మహారాష్ట్రలోనే కరోనా కేసులు ఎక్కువగా నమోదయ్యాయి.. ఢిల్లీ రాష్ట్రంలో కూడా కరోనా కేసుల వ్యాప్తి కొనసాగుతుంది.

మరో వైపు దేశంలో కూడా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. దేశంలో కరోనా కేసులు లక్షను దాటాయి. కరోనా ఒమిక్రాన్ కేసులు 3,007కి చేరుకొన్నాయి. దేశంలోని మహారాష్ట్రలో కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. దేశంలో నమోదౌతున్న కేసుల్లో  మహారాష్ట్రలోనే కరోనా కేసులు ఎక్కువగా నమోదయ్యాయి.. ఢిల్లీ రాష్ట్రంలో కూడా కరోనా కేసుల వ్యాప్తి కొనసాగుతుంది.

తెలంగాణలో కరోనా కేసుల వ్యాప్తి సాగుతున్నందున  వైద్య ఆరోగ్య శాఖలో  పనిచేస్తున్న ఉద్యోగులకు సెలవులను రద్దు చేసింది ప్రభుత్వం. వచ్చే  నెల రోజులు జాగ్రత్తగా ఉండాలని కూడా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసరావు చెప్పారు. 

వైద్యరోగ్య శాఖ సూచనలు ప్రజలంతా పాటించాలని వైద్య శాఖ కోరింది. కేసులు పెరుగుతున్నందున ఎవరికి వారే స్వీయ నియంత్రణ పాటించాలని కోరారు. ప్రభుత్వమే అన్ని చేస్తుందని భావించకూడదని చెప్పారు. కోవిడ్ తీవ్రత దృష్ట్యా రాజకీయ పార్టీలు బాధ్యత తీసుకోవాలని అన్నారు. రాజకీయ పార్టీలు వారి కార్యక్రమాలను నియంత్రించుకోవాలి చెప్పారు. పిల్లలకు సెలవులు ఇచ్చామని.. అయితే సెలవుల్లో పిల్లలు బయటకు వెళ్లవద్దని, బయటకు వెళితే కోవిడ్ నిబంధనలు పాటించాలని తెలిపారు. 

 ఇకపై ఒమిక్రాన్ కేసులను కరోనా బులిటెన్‌లో ప్రత్యేకంగా ప్రస్తావించమని చెప్పారు. కొత్త కేసుల్లో 70 శాతం ఒమిక్రాన్‌వే అనుకోవచ్చని ఆయన అన్నారు. కరోనా థర్డ్ వేవ్ ప్రారంభమైందని చెప్పారు. ఢిల్లీలో ఒక్క రోజే 10 వేలకు పైగా కేసులు నమోదయ్యాయని తెలిపారు. రాష్ట్రంలో జనవరి 1 నుంచి కేసులు పెరుగుతున్నాయని.. జీహెచ్‌ఎంసీ పరిధిలో భారీగా కేసులు నమోదవుతున్నాయని తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios