Asianet News TeluguAsianet News Telugu

రేవంత్, సంజయ్, షర్మిలకు పోటీగా తీన్మార్ మల్లన్న.. వచ్చే నెల నుంచి పాదయాత్ర

ఘట్‌కేసర్‌ మండల పరిధిలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో తన అభిమానులతో ఆదివారం మల్లన్న సమావేశమయ్యారు. ఆగస్టు 29న జోగులాంబ గద్వాల్‌ జిల్లా నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నట్టు తీన్మార్‌ మల్లన్న వెల్లడించారు

teenmar mallanna padayatra in telangana ksp
Author
Hyderabad, First Published Jul 18, 2021, 6:42 PM IST

తెలంగాణలో రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. ప్రధాన పార్టీల్లోని పలువురు నేతలు పాదయాత్ర చేస్తామని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. వీరిలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, వైఎస్ఆర్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, బీజేపీ నేత ఈటల రాజేందర్ వున్న సంగతి తెలిసిందే. వీరితో పాటు ప్రముఖ జర్నలిస్ట్ తీన్మార్‌ మల్లన్న కూడా తాజాగా పాదయాత్ర చేస్తానని ప్రకటించారు. 

ఘట్‌కేసర్‌ మండల పరిధిలోని ఓ ఫంక్షన్‌ హాల్‌లో తన అభిమానులతో ఆదివారం మల్లన్న సమావేశమయ్యారు. ఆగస్టు 29న జోగులాంబ గద్వాల్‌ జిల్లా నుంచి పాదయాత్ర ప్రారంభించనున్నట్టు తీన్మార్‌ మల్లన్న వెల్లడించారు. పాదయాత్రకు ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను ఆహ్వానిస్తామని తెలిపారు. తమ పార్టీలో చేరాలంటూ ఇప్పటికే కొందరు నేతలు ఆహ్వానించారని మల్లన్న తెలిపారు. తెలంగాణలో పార్టీ పెట్టిన వైఎస్‌ షర్మిల ఆధార్‌, ఓటరు గుర్తింపు కార్డు ఎక్కడ ఉందో చెప్పాలని మల్లన్న డిమాండ్‌ చేశారు.  

ALso REad:పల్లాకు చెమటలు పట్టించిన ఎవరీ తీన్మార్ మల్లన్న?

కాగా, ఇటీవల జరిగిన నల్గొండ - వరంగల్ - ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన తీన్ మార్ మల్లన్న హోరాహోరీగా పోరాడి ఏకంగా టీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డికి చెమటలు పట్టించాడు. మల్లన్న ఓటమి చెందినప్పటికీ...  ఒక స్వతంత్ర అభ్యర్థి ఈ స్థాయిలో ఎలా ఓట్లు సాధించాడన్న చర్చ నడిచింది. 

ఉమ్మడి నల్గొండ జిల్లా భువనగిరి సమీపంలోని మాదాపూర్ గ్రామానికి చెందిన నవీన్ కుమార్ వి6 లో ఉద్యోగానికి  రాజీనామా చేసి తెలంగాణ ఏర్పడ్డాక నల్గొండ - ఖమ్మం - వరంగల్ స్థానినికి జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేసి ఓటమిపాలయ్యారు. ఇక ఆ తరువాత మరల 10 టీవీ లో ఇదే తరహా కార్యక్రమాన్ని హోస్ట్ చేసాడు. 

Follow Us:
Download App:
  • android
  • ios