Asianet News TeluguAsianet News Telugu

బాలిక వెంటపడి, వేధిస్తున్నాడని టీనేజర్ హత్య.. ముగ్గురు అరెస్ట్

కూతురి వెంటపడి వేధిస్తున్నాడని టీనేజర్ ను కొట్టి చంపిన కేసులో ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. 

Teenager killed for stalking and harassing girl, Three arrested in nalgonda - bsb
Author
First Published May 27, 2023, 10:59 AM IST

నల్గొండ : 18 ఏళ్ల ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థి 16 ఏళ్ల బాలికను వేధిస్తున్నాడనే ఆరోపణతో గురువారం సాయంత్రం నల్గొండ జిల్లాలోని ఆమె స్వగ్రామంలో కుటుంబ సభ్యులు అతడిని కొట్టి చంపిన సంగతి తెలిసిందే. ఈ కేసులో బాలిక తండ్రితో పాటు మరో ఇద్దరిని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.

"విద్యార్థిపై దాడి చేస్తున్నప్పుడు, ఆవేశంతో, బాలిక తండ్రి రోకలిని తీసుకొని అబ్బాయిని చాలాసార్లు కొట్టాడు. దీంతో తీవ్ర గాయాలతో, యువకుడు కుప్పకూలి అక్కడికక్కడే మరణించాడు" అని గుర్రంపోడ్ సబ్-ఇన్‌స్పెక్టర్ బి శివ ప్రసాద్ తెలిపారు. 

బాధితురాలి మేనమామ బాలిక తండ్రి, ఆమె అమ్మమ్మ, వారి పొరుగువారిపై బాలుడి తండ్రి ఫిర్యాదు చేశాడు. అతను మాట్లాడుతూ.. ‘మా అబ్బాయి చేతులు, కాళ్లు, తల, వీపుపై తీవ్ర గాయాలతో బాలిక ఇంట్లో శవమై పడి ఉండడం గుర్తించాం’’ అని ఆయన ఆరోపించారు.

ప్రేమికుడి ఇంట్లో ఉరివేసుకుని యువతి ఆత్మహత్య... తల్లీ,కొడుకు అరెస్ట్..

కట్టంగూర్ మండలానికి చెందిన విద్యార్థి గురువారం మధ్యాహ్నం బాలికను కలిసేందుకు గుర్రంపోడ్ మండలంలోని బాలిక గ్రామానికి వెళ్లాడు.
టీనేజర్లు ఇద్దరూ నల్గొండలోని ఒకే పాఠశాలలో చదువుకున్నారు. ఒకరికొకరు బాగా తెలుసు. యువకుడు బైక్‌పై బాలిక ఇంటికి చేరుకునే సరికి బాలిక ఇంట్లో ఎవరూ లేరు. ఒంటరిగా ఉంది. 

ఇంటి బయట బైక్ పార్క్ చేసి అమ్మాయితో మాట్లాడేందుకు అతను లోపలికి వెళ్లాడు. అతను బాలికతో మాట్లాడుతుండగా, వ్యవసాయదారుడైన ఆమె తండ్రి పొలం నుండి భోజనానికి ఇంటికి తిరిగి వచ్చాడు. విద్యార్థి ఇంట్లో ఉండడం గమనించి.. బయటి నుంచి తలుపు గడియ పెట్టాడు. పక్కింట్లో ఉన్న తన తల్లిని పిలిచాడు. ఆ తరువాత బాలుడి మీద దాడికి దిగాడు. గొడవ విని అక్కడికి వచ్చిన పక్కింటి వ్యక్తి కూడా వీరితో కలిశాడు. ముగ్గురూ బాలుడిపై దాడికి పాల్పడ్డారు.

బాలిక కంటే ఒక తరగతి సీనియర్‌ అయిన యువకుడు.. బాలిక వెంటపడి వేధిస్తున్నాడని బాలిక తల్లి, అమ్మమ్మ ఆరు నెలల క్రితం నల్గొండ షీ టీమ్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ప్రాథమిక విచారణలో పోలీసులు గుర్తించారు. పోలీసులు అతని తల్లిదండ్రులను పిలిపించి వారి సమక్షంలో కౌన్సెలింగ్ ఇచ్చారు. మృతుడి తల్లిదండ్రులు సూరత్‌లో పనిచేస్తున్నారు. మృతుడు వారి చిన్న కుమారుడు. ఇక్కడ సోదరి దగ్గర ఉంటూ చదువుకుంటున్నాడు. పెద్ద కొడుకు బెంగళూరులో హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సు చేస్తున్నాడు.

Follow Us:
Download App:
  • android
  • ios