ఆమెకు 13, అతనికి 16... ఫేస్ బుక్ లో ప్రేమ.. ఇంట్లోనుంచి పారిపోయి..

స్మార్ట్ ఫోన్ చేతిలో పడితే యువత ఎలా దారి తప్పుతారో చెప్పే తాజా ఉదాహరణ కరీంనగర్ లో జరిగింది. ఆన్ లైన్ క్లాసులు వినేందుకు తల్లిదండ్రులు ఇప్పించిన స్మార్ట్ ఫోన్ ఓ బాలికను తప్పుదారి పట్టించింది. క్లాసులే కాకుండా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడంతో.. ఫేస్ బుక్ ద్వారా పదహారేళ్ల బాలుడితో పరిచయం అయ్యింది. 

teenage girl abscond due to love affair with minor boy in karimnagar - bsb

స్మార్ట్ ఫోన్ చేతిలో పడితే యువత ఎలా దారి తప్పుతారో చెప్పే తాజా ఉదాహరణ కరీంనగర్ లో జరిగింది. ఆన్ లైన్ క్లాసులు వినేందుకు తల్లిదండ్రులు ఇప్పించిన స్మార్ట్ ఫోన్ ఓ బాలికను తప్పుదారి పట్టించింది. క్లాసులే కాకుండా సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండడంతో.. ఫేస్ బుక్ ద్వారా పదహారేళ్ల బాలుడితో పరిచయం అయ్యింది. 

ఆ బాలుడు, బాలికకు మాయమాటలు చెప్పి ఏకంగా తాను ఉండే ప్రాంతానికి రప్పించుకున్నాడు. ఇంట్లో ఉండాల్సిన కూతురు కనిపించకపోవడంతో బాధిత కుటుంబీకులు పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగు చూసింది.

పోలీసులు వివరాల ప్రకారం.. మొయినాబాద్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక(13), స్థానికంగా 8వ తరగతి చదువుతోంది. ఇంట్లోనే ఆన్ లైన్ క్లాసులు వినేందుకు తల్లిదండ్రులు స్మార్ట్ ఫోన్ కొన్నారు. ఆమెకు కరీంనగర్ కు చెందిన ఓ బాలుడు (16) ఫేస్ బుక్ ద్వారా పరిచయమయ్యాడు. ఆరు నెలలుగా బాలికకు మాయమాటలు చెప్పి లవ్ ఎఫైర్ నడుపుతున్నాడు. 

ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో బాలిక బయటకు వెళ్లిపోయింది. ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు బాలిక కనిపించకపోవడంతో చుట్టపక్కల వెతికారు. ఎంతకీ జాడ దొరక్కపోవడంతో అదేరోజు రాత్రి మొయినాబాద్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. 

వెంటనే రంగంలోకి దిగిన మొయినాబాద్ పోలీసులు బాలిక ఆచూకీ పట్టుకుని ఆమెను సురక్షితంగా ఇంటికి చేర్చారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios