కన్న తండ్రి లైంగికంగా వేధించడాన్ని ఆ కూతుళ్లు తట్టుకోలేకపోయారు. తాగిన మైకంలో తండ్రి చేస్తున్న అకృత్యాలను చూసి భరించలేకపోయిన ఆ కూతుళ్లు.. కన్న తండ్రినే అతి కిరాతకంగా హత్య చేశారు. ఈ దారుణ సంఘటన జగద్గిరిగుట్ట లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. జగద్గిరిగుట్ట లోని మగ్దూమ్ నగర్ కి చెందిన రాజు అనే వ్యక్తి కి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా.. అతను ఓ రైస్ మిల్లు నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కాగా.. ఎనిమిది నెలల క్రితం రాజు భార్య అనారోగ్యంతో చనిపోయింది. దీంతో.. ఇద్దరు కూతుళ్లతో అతను జీవిస్తున్నాడు.

అయితే.. భార్య చనిపోవడాన్ని రాజు తట్టుకోలేకపోయాడు. ఈ క్రమంలో భార్య పోయిన బాధలో మద్యానికి బానిసగా మారాడు. రోజూ పీకలదాకా మద్యం తాగి వచ్చి ఇంట్లో ఉన్న కూతుళ్లను నానా రకాలుగా వేధించేవాడు. తండ్రి పెడుతున్న బాధలను ఆ ఇద్దరు బాలికలు తట్టుకోలేకపోయారు. దీంతో.. గొంతు పిసికి హత్య చేశారు. కాగా.. బాలికల వయసు ఒకరికి 17ఏళ్లు కాగా.. మరొకరికి 16ఏళ్లు కావడం గమనార్హం. కాగా.. పెద్దమ్మాయి ఇంటర్ చదువుతుండగా.. రెండో అమ్మాయి.. స్కూల్ మధ్యలోనే ఆపేసింది. కాగా.. ఈ మేరకు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.