కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ వ్యక్తి మతిస్థిమితం సరిగ్గా లేని యువతిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. హైదరాబాద్ నగరంలో రోడ్ల పక్కన తిరుగుతున్న మతిస్థిమితం లేని యువతికి మాయమాటలు చెప్పి, తన బైక్ మీద ఎక్కించుకుని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు.

రంగారెడ్డి జిల్లా, మొయినాబాద్ మండలం, హిమాయత్ నగర్ లో మంగళవారం రాత్రి జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం హిమాయత్ నగర్ కు చెందిన యువకుడు ఆదిల్ (19) మంగళవారం రాత్రి నగరం నుంచి మతిస్థిమితం లేని ఓ యువతిని తన బైక్ మీద ఎక్కించుకుని హిమాయత్ నగర్ గ్రామ సమీపానికి తీసుకొచ్చాడు.
రోడ్డు పక్కన బైక్ పెట్టి, యువతిని చెట్లపొదలలోకి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. రోడ్డుపై అటుగా వెళ్తున్న పెట్రోలింగ్ పోలీసులు అనుమానం వచ్చి చూడగా... చెట్ల పొదల్లో నుంచి యువకుడు పారిపోతుంటే పట్టుకున్నారు. యువతిని సైతం పట్టుకుని పోలీస్ స్టేషన్కి తరలించారు.
యువతికి సరిగా లేకపోవడంతో ఆమెకు సంబంధించిన వివరాలు తెలియరాలేదు. యువకుడిని విచారించగా అసలు విషయం అంగీకరించాడు. దీంతో అతనిపై కేసు నమోదు చేసి, గురువారం రిమాండ్కు తరలించారు. యువతికి వైద్య పరీక్షలు నిర్వహించి, సంరక్షణ కేంద్రానికి పంపించారు. అయితే ఘటన జరిగి మూడు రోజులైనా ఈ విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు.