హైదరాబాద్:  సికింద్రాబాద్‌లో ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో పనిచేసే టెక్కీ సుస్మిత గురువారం నాడు ఆత్మహత్య చేసుకొంది.

గురువారం నాడు ఉదయం ఆమె తాను పనిచేసే కార్యాలయానికి వెళ్లింది. విధుల్లో ఉన్న సమయంలోనే కార్యాలయంలోని ఆరో అంతస్తుకు వెళ్లి కిందకు దూకింది.

ఆత్మహత్య చేసుకోవడానికి ముందుగా ఏం జరిగిందనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు. కింద పడిన  సుస్మిత అక్కడికక్కడే మరణించింది. ఈ విషయమై మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు.

సుస్మిత ఎందుకు ఆత్మహత్య చేసుకొందో అర్ధం కావడం లేదని సహచర ఉద్యోగులు చెబుతున్నారు.సుస్మిత కుటుంబ సభ్యులకు సాఫ్ట్ వేర్ కంపెనీ సమాచారం ఇచ్చింది. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఏ ఫ్లోర్ నుండి ఆమె కిందకు దూకింది. కిందకు దూకిన సమయంలో ఎవరున్నారు.. తొలుత ఆమెను ఎవరు చూశారనే విషయాలపై సంఘటన స్థలంలో పోలీసులు విచారించారు.

సుస్మిత ఆత్మహత్యకు గల కారణాలకు గల కారణాలపై దర్యాప్తు చేసి తమకు న్యాయం చేయాలని మృతురాలి కుటుంబసభ్యులు పోలీసులను కోరుతున్నారు.