హైదరాబాద్:  మరో మహిళను పెళ్లి చేసుకొంటాడని తెలిసి కూడ వెంకటేష్ ను వదిలి పెట్టడానికి  ఇష్టపడలేదని టెక్కీ లావణ్య లహరి  సోదరి చైతన్య చెప్పారు.  చనిపోయే ముందు రోజు కూడ లహరితో తాము మాట్లాడినట్టుగా  ఆమె తెలిపారు.

మంగళవారం నాడు ఓ తెలుగు న్యూస్ ఛానెల్ కు ఆమె ఇంటర్వ్యూ ఇచ్చారు.  లహరి భర్త వెంకటేష్ లహరిని శారీరకంగా, మానసికంగా చిత్రహింసలకు గురి చేశాడని ఆమె ఆరోపించారు. అయినా కూడ భర్త మీద ప్రేమతో వదల్లేదన్నారు. మరో పెళ్లి చేసుకొనేందుకు కూడ  లహరి వదిలిపెట్టలేదన్నారు.

also read:అమ్మాయిలతో చెడు తిరుగుళ్లు, కుక్కకైనా విశ్వాసం ఉంటుంది: టెక్కీ లహరి చివరి వీడియో

లాక్ డౌన్ సమయంలోనూ లహరితో మాట్లాడే ప్రయత్నం చేసినట్టుగా ఆమె గుర్తు చేసుకొన్నారు. కేరళకు ట్రాన్స్‌ఫర్ అయిందని వెళ్లిపోతానని చెప్పిందన్నారు. వెంకటేష్ తో పాటు కుటుంబసభ్యులకు శిక్ష పడాలని ఆమె డిమాండ్ చేశారు.

ఈ ఏడాది జూన్ 27వ తేదీన లహరి తన ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడింది. భర్త వెంకటేష్ వేధింపులు భరించలేక ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టుగా ఆమె సెల్ఫీ వీడియోలో తెలిపింది. ఈ కేసులో ఇప్పటికే వెంకటేష్ తో పాటు కుటుంబసభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు.