హాస్టల్ లో ఉరివేసుకొని ఓ టెక్కీ ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన హైదరాబాద్ లోని మాదాపూర్ లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. నెల్లూరుకి చెందిన సురేష్ రెడ్డి(25) .కొండాపూర్ లోని ఆటోమేటిక్ డేటా ప్రాసెస్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు.

కాగా.. సోమవారం ఉన్నట్టుండి హాస్టల్ గదిలో ఫ్యాన్ కి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. గమనించిన హాస్టల్ మేట్స్  హాస్టల్ యాజమాన్యానికి సమాచారం అందించారు.

వారు సురేష్ రెడ్డి ఉన్న గదిలో తలపులు పగల గొట్టి చూశారు. కాగా.. అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు. కాగా.. అతని కుటుంబసభ్యులకు సమాచారం అందించి అనుమానిత మృతి కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

కాగా.. సురేష్ రెడ్డి గతంలో ముంబయిలో ఉద్యోగం చేశాడని.. ఈ సంవత్సరం జనవరిలోనే హైదరాబాద్ కి వచ్చాడని కుటుంబసభ్యులు తెలిపారు. మృతికి గల కారణాలు తెలియాల్సి  ఉంది.