Asianet News TeluguAsianet News Telugu

వరదల్లో చిక్కుకున్న టీచర్లను కాపాడిన మంత్రి

తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ శివారులో నాగపూర్ వాగులో చిక్కుకున్న ఐదుగురు ఉపాధ్యాయుల ప్రాణాలను మంత్రి జోగు రామన్న కాపాడారు.

Teachers protected by minister from floods
Author
Adilabad, First Published Aug 16, 2018, 3:44 PM IST

ఆదిలాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ఆదిలాబాద్ శివారులో నాగపూర్ వాగులో చిక్కుకున్న ఐదుగురు ఉపాధ్యాయుల ప్రాణాలను మంత్రి జోగు రామన్న కాపాడారు. మావల మండలం వాగపూరు గ్రామంలో ఉపాధ్యాయులుగా విధులు నిర్వర్తిస్తున్న రమేష్, ప్రవీణ్ కుమార్, ప్రతాప్, చంద్రశేఖర్, సుజాతలు కారులో పాఠశాలకు వెళ్తుండగా వైజాపూర్ వద్ద వరద ఉద్ధృతికి నీటితో వాగులో  చిక్కుకున్నారు.

Teachers protected by minister from floods

విషయం తెలుసుకున్న మంత్రి జోగు రామన్న హుటాహుటిన ఫైరింజన్ వెంట తీసుకుని సంఘటన స్థలానికి చేరుకున్నారు .వాగులో చిక్కుకున్న వారిని ఫైర్ సిబ్బంది సురక్షితంగా బయటకు బయటకు చేరవేశారు. కారు మాత్రం వాగులో కొట్టుకుపోయింది .ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా కుండపోత వర్షం కురుస్తోంది. దాంతోవాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్ళలోకి వరద నీరు చొచ్చుకుని వచ్చింది. 

Teachers protected by minister from floodsTeachers protected by minister from floods

పలు ప్రాంతాల్లో ప్రజలు భయాందోళనలతో బిక్కుబిక్కుమంటున్నారు. ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. అధికారులు   సాత్నాల మత్తడివాగు ప్రాజెక్టు నాలుగు గేట్లను ఎత్తివేసి దిగువకు నీటిని వదిలారు.

Follow Us:
Download App:
  • android
  • ios