అతడు ఉన్నతమైన ఉపాధ్యాయ వృత్తిలో వున్నాడు. తన వద్ద విధ్యనభ్యసించే విద్యార్థులను కన్న బిడ్డల్లాగా చూడాల్సిన అతని కళ్లకు కామపు పొర ఆవరించింది. దీంతో మైనర్లని కూడా చూడకుండా తాను పనిచేసే పాఠశాలలో చదువుకునే చిన్నారులను లైంగికంగా వేధించసాగాడు. పాపం...ఈ కీచకుడి వేధింపులను తట్టుకోలేక బాలికలు ప్రధానోపాధ్యాయురాలి పిర్యాదు చేయడంతో ఈ దారుణం గురించి భయటపడింది. 

తెలంగాణ రాజధాని హైదరాబాద్ శివారు జిల్లా మేడ్చల్ లో ఈ దారుణం చోటుచేసుకుంది. ఘట్‌కేసర్ మండలం ఏదులాబాద్ ప్రభుత్వ పాఠశాలలో  మైనర్  రమణమూర్తి అనే వ్యక్తి ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. ఇతడు నిత్యం పాఠశాలలో చదివే విద్యార్థినులతో అసభ్యంగా ప్రవర్తించేవాడు. మైనర్లని కూడా చూడాకుండా వారిపై లైంగిక వైధింపులకు దిగేవాడు. 

చాలాకాలంగా అతడి ప్రవర్తనను విద్యర్థినులు మౌనంగా భరిస్తూ వస్తున్నారు. అయితే వారి మౌనాన్ని చేతకానితనంగా భావించిన అతడు తన వేధింపులను మరింత ఎక్కువ చేశాడు. దీంతో ఇక తట్టుకోలేక పోయిన బాధిత బాలికలు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు భాగ్యలక్ష్మీ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఆమె షీ టీం పోలీసులకు ఈ కీఛక టీచర్ పై ఫిర్యాదు చేసింది. 

దీంతో రంగంలోకి దిగిన ఘట్‌కేసర్ పోలీసులు ఉపాధ్యాయుడు రమణమూర్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడిపై లైంగిక వేధింపుల కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.