అమరావతి: జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించి పెండింగ్ బిల్లులను చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఏపీ అసెంబ్లీ నుండి చంద్రబాబు నేతృత్వంలో టీడీపీ ఎమ్మెల్యేలు శుక్రవారం నాడు అసెంబ్లీ నుండి వాకౌట్ చేశారు.

అసెంబ్లీ ప్రారంభానికి ముందుగా ఇదే విషయమై  చంద్రబాబునాయుడు నేతృత్వంలో ఆ పార్టీ ప్రజా ప్రతినిధులు నిరసన ర్యాలీ నిర్వహించారు. అసెంబ్లీ ప్రారంభమైన తర్వాత కూడ ఇదే విషయమై  టీడీపీ అసెంబ్లీలో లేవనెత్తింది. 

గ్రామాల్లో చేసిన పనులకు బిల్లులు తక్షణమే చెల్లించాలని కేంద్రం ఆదేశించినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. కోర్టులు ఆదేశించినా బేఖాతరు చేయడంపై ధ్వజమెత్తారు. మహాత్మాగాంధీ స్పూర్తిని నిలబెట్టాలని టీడీపీ డిమాండ్ చేసింది.

 బిల్లులు చెల్లించకుండా సర్పంచులు, ఎంపిటిసిల ప్రాణాలతో చెలగాటం ఆడవద్దని టీడీపీ సభ్యులు అసెంబ్లీ కారిడార్లలో నినాదాలు చేశారు.తమ ప్రభుత్వ హయంలో పరిస్థితిని ప్రస్తుత పరిస్థితిని టీడీపీ ప్రజా ప్రతినిధులు గుర్తు చేస్తున్నారు. ఉపాధి హామీ పెండింగ్ నిధులను వెంటనే విడుదల చేయాాలని టీడీపీ డిమాండ్ చేసింది.