హైదరాబాద్‌: రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహిస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా వెనక వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ ఉందని తెలుగుదేశం తెలంగాణ శాఖ అధికార ప్రతినిధి దుర్గాప్రసాద్ ఆరోపించారు. దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ పిచ్చి సినిమాలు తీస్తుంటారని ఆయన దర్శకత్వంలో రూపొందిస్తున్న లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌ సినిమా వెనుక వైపీసీ పాత్ర ఉందని దుర్గా ప్రసాద్ అన్నారు. 

ఆ సినిమా నిర్మాత వైసీపీకి చెందిన వ్యక్తి అని చిత్రంలోని వెన్నుపోటు పాటలో ఏపీ సీఎం చంద్రబాబు ఫోటో వాడారని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. 

ఈ ఫోటోలు తీయకుంటే పరువునష్టం దావా కూడా వేస్తామని ఆయన హెచ్చరించారు. ఆ పాటలో, సినిమాలోని అభ్యంతరకర సన్నివేశాలు తొలగించి భేషరతుగా క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.