హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాదులో తెలుగుదేశం పార్టీ నామ రూపాలు లేకుండా పోయినట్లే. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి, గ్రేటర్ హైదరాబాదులోని ఏకైక టీడీపి కార్పోరటర్ కారెక్కారు. 

టీడీపి కార్పోరేటర్ మందాడి శ్రీనివాస రావు పార్టీకి రాజీనామా చేసి, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)లో చేరారు. కూకట్ పల్లి శాసనసభ్యుదడు మాధవరం కృష్ణారావు ఆధ్వర్యంలో ఆయన టీఆర్ఎస్ లో చేరారు. 

కెపిహెచ్ బీ డివిజన్ కార్పోరేటర్ అయిన మందాడి శ్రీనివాస రావు నివాసం నంది నగర్ లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.