సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఆయన పై కేసుల మీద కేసులు పెడుతున్నారు. ఇప్పటికే ఆర్జీవీపై ఇద్దరు టీడీపీ నేతలు కేసులు పెట్టగా.. తాజాగా చంద్రబాబు అభిమాని ఒకరు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

మంగళవారం రామ్‌గోపాల్‌వర్మపై పేట్‌బషీరాబాద్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. ఏపీ సీఎం చంద్రబాబునాయుడు.. జగన్‌ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకొన్నట్లు మార్ఫ్‌ చేసిన ఫొటోలను వర్మ సోషల్‌ మీడియాలో అప్‌లోడ్‌ చేసిన సంగతి తెలిసిందే. కాగా.. దీనిపై టీడీపీ అభిమాని, సామాజిక కార్యకర్త గోపీ పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశారు. వర్మ బహిరంగ క్షమాపణలు చెప్పకుంటే ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు.