హైదరాబాద్: తుపాకులు, కత్తులతో బెదిరించి ఓ సినీ డిస్ట్రిబ్యూటర్ ఆస్తులను బలవంతంగా స్వాదీనం చేసుకోవాలని ప్రయత్నించిన ఓ మాజీ ఎమ్మెల్యే తనయుడిపై కేసు నమోదయ్యింది. తెలంగాణ రాజధాని హైదరాబాద్ శివారులో విలువైన భూమిపై కన్నేసిన సదరు మాజీ ఎమ్మెల్యే కొడుకు డిస్ట్రిబ్యూటర్ ని కిడ్నాప్ చేసి సినిమా స్టైల్లో బెదిరింపులకు దిగాడు. 

ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. కడప జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే, టిడిపి నాయకులు వరదరాజులు రెడ్డి కుమారుడు కొండారెడ్డి హైదరాబాద్  తో నివాసముండే శివ గణేష్ అనే సినిమా పంపిణీదారున్ని కిడ్నాప్ చేశాడు.  తన అనుచరులతో కలిసి తుపాకులు, కత్తులతో బెదిరించాడు. ఈ ఘటన హైదరాబాద్ నడిబొడ్డున గల బంజారాహిల్స్ లో చోటుచేసుకుంది.

read more  అదృశ్యమై.. శవమై తేలిన వీరభద్ర: మిత్రుల పనేనా..?

తనను కిడ్నాప్ చేసి బెదిరించడమే కాకుండా శామీర్ పేట, కడప జిల్లాల్లోని విలువైన భూమికి చెందిన దస్త్రాలపై బలవంతంగా సంతకం చేయించుకున్నారని బాధితుడు ఆరోపించారు. అతడి ఫిర్యాదుతో ఎమ్మెల్యే తనయుడితో పాటు 18మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.