తెలుగు రాష్ట్రాలను తాను వేర్వేరుగా చూడలేదన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. తెలుగు దేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవాలను పురస్కరించుకుని హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.
తెలుగు వారి సంక్షేమమే టీడీపీ (tdp) పరమావధి అన్నారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (chandrababu naidu) . తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సాన్ని (tdp 40 years celebration) పురస్కరించుకుని హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రపంచ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆవిర్భావ వేడుకలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అధికారం కోసం ఎన్టీఆర్ (nt rama rao) పార్టీ ఏర్పాటు చేయలేదని చంద్రబాబు తెలిపారు. తెలుగు జాతికి పునరంకితం కావాల్సిన సమయం వచ్చిందని ఆయన అన్నారు. తాను తెలంగాణను ఎప్పుడూ తక్కువ చేసి చూడలేదని చంద్రబాబు వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌ను తాను ఎంతో అభివృద్ది చేశానని ఆయన గుర్తుచేశారు.
హైదరాబాద్ (hyderabad) తరహాలో అమరావతిని (amaravathi) తయారు చేయాలనుకున్నానని చంద్రబాబు పేర్కొన్నారు. అమరావతిలో ఇన్‌సైడ్ ట్రేడింగ్ (tdp 40 years celebration) జరిగిందని ఆరోపించారని.. కోకాపేటలో 60 వేలు ఉన్న ఎకరా, ఇప్పుడు కోట్లు పలుకుతుందని ఆయన గుర్తుచేశారు. కోకాపేటలో ఫార్ములా వన్ రేసింగ్ పెట్టాలనుకున్నానని చంద్రబాబు వెల్లడించారు. తెలుగు గంగ లాంటి ఎన్నో ప్రాజెక్టుల్ని ఎన్టీఆర్ ప్రారంభించారని వ్యాఖ్యానించారు. కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు లాంటి ఎన్నో ప్రాజెక్టుల్ని ప్రారంభించానని చంద్రబాబు గుర్తుచేశారు. పోలవరంతో నదుల అనుసంధానానికి సంకల్పం చేశానని ఆయన తెలిపారు. తాను ఆనాడు చేసిన అభివృద్ధి ఫలాలే ఇప్పుడు కనిపిస్తున్నాయని చంద్రబాబు పేర్కొన్నారు.
అంతకుముందు టీడీపీ ఆవిర్భావ దినోత్సవాలను (tdp formation day) పురస్కరించుకుని హైదరాబాద్ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో (old mla quarters hyderabad) ఎన్టీఆర్ విగ్రహానికి చంద్రబాబు (chandrababu naidu) నివాళి అర్పించారు. అనంతరం ఆయన ప్రసంగిస్తూ.. టీడీపీ ముందు, టీడీపీకి తర్వాత అన్నట్లుగా వ్యవహరించాల్సిన అవసరం వున్నారు. సంక్షేమం, అభివృద్ధి, తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పింది ఎన్టీ రామారావు అని చంద్రబాబు ప్రశంసించారు. 40 సంవత్సరాలలో ఎన్నో చరిత్రలు సృష్టించామని.. ఎన్నో రికార్డులు బ్రేక్ చేశామని ఆయన గుర్తుచేశారు. మళ్లీ ఇవాళ జాతి పునరంకితం కావాల్సిన సందర్భం, యువత ముందుకు రావాల్సిన సందర్భం వుందన్నారు. తెలుగుదేశం పార్టీని, తెలుగు జాతిని ఎవ్వరూ విడదీయలేరని చంద్రబాబు అన్నారు. తెలుగు వారు ఎక్కడుంటే అక్కడ తెలుగుదేశం పార్టీ వుంటుందని ఆయన పేర్కొన్నారు. 40 ఏళ్ల క్రితం ఎన్టీఆర్ (ntr) పెట్టిన తెలుగుదేశం పార్టీ (telugu desam party) చరిత్ర సృష్టించిందన్నారు
