హైదరాబాద్‌లో దారుణం జరిగింది.. ఓ టెక్కీ బిల్డింగ్‌పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడింది. మియాపూర్ మదీనాగూడలోని లాండ్‌మార్క్ రెసిడెన్సీ అపార్ట్‌మెంట్‌లో నివాసిస్తున్న మహతీ అనే యువతి గచ్చిబౌలీలోని టీసీఎస్‌ సంస్థలో హెచ్ఆర్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు.

ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం ఆమె తన అపార్ట్‌మెంట్‌పై నుంచి కిందకు దూకి బలవ్మనరణానికి పాల్పడ్డారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మహతీ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు.