పదో తరగతి చదివిన ఓ వ్యక్తి ఏకంగా డాక్టర్ అవతారం ఎత్తాడు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో బయటపడిన నకిలీ డాక్టర్ ఉదంతంతో పోలీసులు అవాక్కయ్యారు.

వివరాల్లోకి వెళితే... ఆసిఫ్‌నగర్ పోలీస్ స్టేషన్‌ పరిధిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఫేక్ సర్టిఫికేట్‌తో డాక్టర్ అవతారం ఎత్తిన ముజిబ్‌ గురించి టాస్క్‌ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది.

దీంతో సదరు ఆసుపత్రిపై పోలీసులు దాడి చేసి ముజిబ్‌ను, ఆసుపత్రి నిర్వాహకుడు షోహబ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం నిందితులను ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అయితే ముజిబ్‌కు నకిలీ డాక్టర్ సర్టిఫికేట్ ఇచ్చిందెవరనే దానిపై టాస్క్‌ఫోర్స్ ఆరా తీస్తోంది. ఇందుకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.