కరోనా వైరస్ రక్కసి ఒక పక్కన విరుచుకుపడుతున్నప్పటికీ... హైదరాబాద్ పరిధిలో రాజకీయ హడావుడి కనబడుతుంది. ముఖ్యంగా కేటీఆర్ హడావుడి ఎక్కువయింది. ఆయన హైదరాబాద్ ను ఆ కొస నుంచి ఈ కొస వరకు మొత్తం కలియతిరుగుతూ తెగ ఓపెనింగులు చేసేస్తున్నారు. 

ఫ్లై ఓవర్ల నుంచి మొదలు బ్రిడ్జిల వరకు అన్నిటికి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేపడుతున్నారు. త్వరలోనే దుర్గం చెరువు మీద కొత్తగా నిర్మితమవుతున్న కేబుల్ బ్రిడ్జి కూడా ప్రారంభించనున్నారు. 

హైదరాబాద్ పరిధిలో జరుగుతున్న అన్ని పరిణామాలను, ఏర్పాట్లను పరిశీలిస్తే అర్ధమయ్యే విషయం ఒక్కటే! త్వరలోనే జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. అందుకోసమే హైదరాబాద్ సుందరీకరణ కార్యక్రమాలు ఇంత వేగవంతంగా చేపడుతున్నారు. 

నవంబర్ లో బీహార్ ఎన్నికలు నిర్వహించనున్నట్టుగా ఎన్నికల కమిషన్ ప్రకటించిన నేపథ్యంలో.... పనిలో పనిగా జిహెచ్ఎంసీ ఎన్నికలను కూడా వాటి తరువాత నిర్వహించాలని తెరాస సర్కారు యోచిస్తున్నట్టుగా తెలియవస్తుంది. 

ఇకపోతే తెరాస దూకుడు ప్రదర్శిస్తుండగానే బీజేపీ కూడా హైదరాబాద్ పై నాజర్ పెంచింది. గ్రేటర్ పరిధిలో జరిగే ఎన్నికలను ఎలాగైనా గెలిచి, తెలంగాణాలో తెరాస కు ప్రత్యామ్నాయం తామే అని నిరూపించుకోవాలని విశ్వ ప్రయత్నం చేస్తుంది. 

జిహెచ్ఎంసీ ఎన్నికలపై బీజేపీ దృష్టి కేంద్రీకరించడానికి అనేక కారణాలు కనబడుతున్నాయి. ముఖ్యంగా 2023 ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని బీజేపీ  కదుపుతోంది. జిహెచ్ ఎంసీ ఎన్నికలు డిసెంబర్ లేదా వచ్చే సంవత్సరం తొలి నాళ్లలో నిర్వహించాలని తెరాస సర్కార్ యోచిస్తోంది. అంటే గ్రేటర్ ఎన్నికల తరువాత అసెంబ్లీ ఎన్నికలకు ఉండేది కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే. 

ఇప్పటివరకు బీజేపీకి తెరాసకు సరైన ప్రత్యామ్నాయం మేమె అని చెప్పుకునే స్థాయిలో విజయాలు దక్కలేదు, పార్లమెంటు ఎన్నికల్లో విజయం సాధించినప్పటికీ... తెరాస ప్రాంతీయ పార్టీ అవడం, కాంగ్రెస్, బీజేపీల మధ్య ముఖ్యంగా జరిగిన పోరుగానే దాన్ని పరిగణించవలియూసీ వస్తుంది. 

ఇప్పుడు గనుక జిహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీ సత్త చాట గలిగితే తెరాస కు ప్రత్యామ్నాయంగా మరింత బలంగా రాజకీయం చేయాలని యోచిస్తున్నారు బీజేపీ వారు. గ్రేటర్ ఎన్నికలపై బీజేపీ ఆశలు పెట్టుకోవడానికి అనేక కారణాలు కనబడుతున్నాయి. 

ప్రస్తుతానికి కాంగ్రెస్ నాయకత్వలేమితో కొట్టుమిట్టాడుతోంది. రాష్ట్రం తరువాత రాష్ట్రం కోల్పోతూ మరింతగా బలహీనపడుతుంది. తెలంగాణలో పరిస్థితి కూడా అలానే ఉంది. ఇక్కడ కూడా కాంగ్రెస్ బలంగా మాత్రం కనబడడం లేదు. ముఖ్యంగా గ్రేటర్ పరిధిలో ఇప్పుడు బలమైన నాయకులే కరువయ్యారు.

ఈ తరుణంలో ఫైట్ బీజేపీ వర్సెస్ తెరాస గా మారుతుంది. దీని వల్ల బీజేపీకి రెండు లాభాలు కనబడుతున్నాయి. మొదటగా ప్రతిపక్ష  ఆస్కారం కనబడడంలేదు. రెండవది, కాంగ్రెస్ లేదు కాబట్టి తామే ఇక్కడ ప్రత్యామ్నాయం అని చెప్పుకునే వీలుంటుంది. 

ఎప్పటినుండో కూడా బీజేపీకి హైదరాబాద్ పరిధిలో మంచి పట్టుంది. సికింద్రాబాద్ వంటి పార్లమెంటు సీటు కూడా వారి సొంతం. గ్రేటర్ పరిధిలో ఉన్న తమ బలాన్ని ఉపయోగించుకొని ఈ ఎన్నికల్లో తెరాస కు బలంగా షాక్ ఇవ్వాలని యోచిస్తోంది బీజేపీ. 

ఇక బీజేపీ అధికంగా ఆశలు పెట్టుకుంది కరోనా పై. కరోనా కట్టడి విషయంలో తెరాస సర్కార్ విఫలమైందనే ఒక భ్యవన బలంగా ఉంది. ఈ కరోనా కాలంలోనే ఎన్నికలు జరగనున్నట్టుగానే వార్తలు వస్తున్న నేపథ్యంలో దీనిని ఇప్పుడు తెరాస కు వ్యతిరేకంగా వాడాలని యోచిస్తోంది. 

బీజేపీ 2023 ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని, తెలంగాణలో జెండా పాతడానికి ఎదురు చూస్తున్న బీజేపీ.... కాంగ్రెస్ కూడా బలంగా లేని సమయంలో తెలంగాణలో  చేసుకోవాలని యోచిస్తోంది బీజేపీ.