Asianet News TeluguAsianet News Telugu

అన్నింటికి సిద్దంగా ఉన్నాం, భయమెందుకు: బీజేపీపై తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఫైర్


 ఎమ్మెల్యేల ప్రలోభాల  కేసుతో  సంబంధం లేకపోతే  విచారణనకు ఎందుకు  రాలేదో చెప్పాలని  బీజేపీ నేతల ను ప్రశ్నించారు తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి.

Tandur MLA Pilot Rohith Reddy  fires  on  BJP
Author
First Published Dec 26, 2022, 7:30 PM IST

హైదరాబాద్:ఎమ్మెల్యేల ప్రలోభాల కేసు  విచారణను సీబీఐకి అప్పగిస్తూ  తెలంగాణ హైకోర్టు  ఆదేశాల ఆర్డర్  కాపీ వచ్చిన తర్వాత ఏం చేయాలనే దానిపై  నిర్ణయం తీసుకుంటామని  తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి  చెప్పారు.సోమవారంనాడు హైద్రాబాద్ లోని తన నివాసంలో  తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి  మీడియాతో మాట్లాడారు.  ఈడీ విచారణలో  తనను ఇబ్బంది  పెట్టే అంశం  ఏమీ దొరకలేదన్నారు. అందుకే ఈ కేసులో సీబీఐని రంగంలోకి దింపారని  రోహిత్ రెడ్డి ఆరోపించారు. 

ఎమ్మెల్యేల ప్రలోభాల కేసు ఈడీ పరిధిలోకి రాకపోయినా  కూడా  తనను విచారణకు పిలిచారని  పైలెట్ రోహిత్ రెడ్డి  విమర్శించారు. ఈ కేసుతో   బీజేపీకి  సంబంధం లేకుంటే ఎందుకు  విచారణను ఎదుర్కోలేదో చెప్పాలని  ఆయన ప్రశ్నించారు. తాము అన్నింటికి సిద్దంగా  ఉన్నట్టుగా  రోహిత్ రెడ్డి  ప్రకటించారు.న్యాయవ్యవస్థపై తనకు  నమ్మకం ఉందని  రోహిత్ రెడ్డి  తెలిపారు. బీజేపీ నేతలు చెప్పినట్టుగానే  జరగడం ఆలోచించాల్సిన విషయమని  రోహిత్ రెడ్డి  చెప్పారు. 

also read:ఎమ్మెల్యేల ప్రలోభాల కేసు: ఈడీ విచారణను సవాల్ చేస్తూ హైకోర్టులో పైలెట్ రోహిత్ రెడ్డి పిటిషన్

సిట్  లో  సీనియర్  అధికారులున్న విషయాన్ని  ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి  గుర్తు  చేశారు.   రాష్ట్రంలో, దేశంలో  ఏం జరుగుతుందో  ప్రజలంతా  ఆలోచించాలని  రోహిత్ రెడ్డి  కోరారు.  ఈ కేసులో  అరెస్టైన వారిని  బీజేపీ  కాపాడుతుందని  ఆయన ఆరోపించారు. న్యాయవ్యవస్థను కూడా  బీజేపీ నేతలు  తప్పుదోవ పట్టించేందుకు  ప్రయత్నిస్తున్నారన్నారు. 

ఎమ్మెల్యేల ప్రలోభాల కేసు విచారణను  సీబీఐకి అప్పగిస్తూ  తెంంగాణ హైకోర్టు  ఇవాళ ఆదేశాలు జారీ చేసింది. సిట్  దర్యాప్తును నిలిపివేయాలని కోరింది. సిట్  విచారణ  సీఎం కేసీఆర్  కనుసన్నల్లో  సాగుతుందని  పిటిషనర్లు  ఆరోపించారు.  బీజేపీతో పాటు మరో నలుగురు పిటిషన్లు దాఖలు చేశారు.  ఈ పిటిషన్లలో  రెండు  పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది.మిగిలిన మూడు పిటిషన్లను  పరిగణనలోకి తీసుకుంది. టెక్నికల్  అంశాలను ఆధారంగా  చేసుకుని ఈ రెండు  పిటిషన్లను  హైకోర్టు  కొట్టేసింది. సిట్  తో కాకుండా  సీబీఐ లేదా స్వతంత్ర దర్యాప్తు సంస్థతో  విచారణ జరిపించాలని  ఐదు పిటిషన్లలో  పిటిషన్‌దారులు  కోర్టును కోరారు.ఈ పిటిషన్లపై  సుదీర్థంగా  వాదనలను విన్న తర్వాత  ఇవాళ తెలంగాణ హైకోర్టు తీర్పును వెలువరించింది. ఈ కేసు విచారణ సమయంలో  దేశ వ్యాప్తంగా  పేరొందిన  ప్రముఖ లాయర్లు  వాదనలు విన్పించారు.

Follow Us:
Download App:
  • android
  • ios