విచారణలో అన్నీ విషయాలు బయటకు వస్తాయని తాండూరు సీఐ రాజేందర్ రెడ్డి చెప్పారు. తనను ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి తిట్టిన విషయమై సీఐ స్పందించారు.

తాండూరు: అన్ని విషయాలు విచారణలో బయటకు వస్తాయని Tandur సీఐ Rajender Reddy చెప్పారు. తనను ఎమ్మెల్సీ Mahender Reddy బూతులు తిట్టిన ఘటనపై తాండూరు పోలీస్ స్టేషన్ లో కేసు పెట్టారు.. ఈ విషయమై సీఐ రాజేందర్ రెడ్డి గురువారం నాడు మీడియాతో మాట్లాడారు.

 తాను ఎవరికీ తొత్తు కాదని కూడా సీఐ రాజేందర్ రెడ్డి వివరణ ఇచ్చారు. ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి తనను పోన్ లో దూషించిన విషయమై సీనియర్ అధికారులకు పిర్యాదు చేసిన తర్వాత కేసు పెట్టినట్టుగా చెప్పారు. ఆ వాయిస్ ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి వాయిస్ అవునో కాదో విచారణలో తేలుతుందన్నారు. వ్యక్తిగతంగా తనకు, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డికి మధ్య ఎలాంటి వివాదాలు లేవన్నారు. టెంపుల్ వద్ద జరిగిన ఘటనతోనే MLC మాట్లాడారన్నారు. గుడిలో కార్పెట్ ను పోలీసులు ఎలా వేస్తారని ఆయన ప్రశ్నించారు.ఈ విషయంలో తమకు ఏం సంబంధమని ఆయన అడిగారు.గుడికి ఎమ్మెల్యే వచ్చిన సమయంలో ఆయన వెంట రౌడీషీటర్లు ఎవరూ లేరన్నారు.

 ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి సీఐ రాజేందర్ రెడ్డిని దూషించినట్టుగా చెబుతున్న ఆడియో వైరల్ గా మారింది.. ఉద్దేశ్యపూర్వకంగానే ఈ ఆడియోను వైరల్ చేశారని ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి ఆరోపించారు. గతంలో యాలాల ఎస్ఐగా రాజేందర్ రెడ్డి పనిచేసిన సమయంలో కూడా ఇలానే చేశారని ఆయన ఆరోపించారు. సీఐ రాజేందర్ రెడ్డి అంటే తనకు అభిమానమని ఆయన చెప్పారు.

ఈ నెల ఈ నెల 23న తాండూరులో జరిగిన భావిగి భద్రేశ్వరస్వామి రథోత్సవ కార్యక్రమంలో తనకు అడ్డంగా ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి అనుచరులతో కూర్చొన్నా కూడా సీఐ రాజేందర్ రెడ్డి వారించలేదనే ఆగ్రహంతో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి ఫోన్ చేసి దూషించారనే ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ ఆడియో ఆధారంగా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డిపై తాండూరు పోలీస్ స్టేషన్ లో పోలీసులు మహేందర్ రెడ్డి పై కేసు నమోదు చేశారు. 

ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి వ్యాఖ్యలపై పోలీస్ అధికారుల సంఘం కూడా తీవ్రంగా స్పందించింది. ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి భేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మహేందర్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలన్నారు.

తాండూరు MLA పైలెట్ Rohith Reddy, ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డికి మధ్య కొంత కాాలంగా సాగుతున్న ఆధిపత్య పోరు ఈ ఘటనతో తారాస్థాయికి చేరుకొందని బట్టబయలైంది.తమ వర్గానికి చెందిన ప్రజా ప్రతినిధులతో పాటు మొదటి నుండి టీఆర్ఎస్ లో ఉన్న వారిపై అక్రమంగా కేసులు పెట్టిస్తున్నారని ఎమ్మెల్యే రోహిత్ రెడ్డిపై ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి ఆరోపణలు చేశారు. తమ వర్గం వారిని అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఈ విషయాలను ప్రశ్నిస్తే తనపై ఈ రకంగా కేసులు బనాయిస్తున్నారన్నారు.