కరోనా మహమ్మారికి నేడు వ్యాక్సిన్ పంపిణీ మొదలుపెట్టిన సంగతి తెలిసిందే. కొద్దిసేపటి క్రితం ప్రధాని నరేంద్రమోదీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. కాగా... ఈ వ్యాక్సిన్ పంపిణీ పై తెలంగాణ గవర్నర్ తమిళి సై స్పందించారు. కోవిడ్ వ్యాక్సిన్ దేశానికే గర్వకారణమని గవర్నర్ తమిళి సై అన్నారు. తాను ఈ రోజు వ్యాక్సిన్ తీసుకోవడం లేదని ఆమె చెప్పారు.

తాను వ్యాక్సిన్ తీసుకోలేదని.. మొదట ఫ్రంట్ లైన్ వర్కర్స్  అన్న ప్రధాని సూచన మేరకు ఆ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. తాను ప్రజలతో పాటు తీసుకుంటానన్నారు. ప్రధాని మోదీ చెప్పినట్లు స్వయం సమృద్ధ భారత్‌ను చూస్తున్నామని ఆమె వ్యాఖ్యానించారు. ఈ వ్యాక్సిన్ ఎండింగ్ ఆఫ్ కొవిడ్ అన్నారు. 

ఫ్రంట్ లైన్ వర్కర్స్‌కి కృతజ్ఞతలు తెలిపారు. ప్రధాని హైదరాబాద్ వచ్చి వ్యాక్సిన్ పరిశోదనలను ప్రోత్సహించారన్నారు. ఏ దేశం‌పై ఆధారపడాల్సిన అవసరం భారత్‌కు లేదన్నారు. వ్యాక్సిన్ వచ్చినా కొవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. 140 కేంద్రాల్లో 30 మంది చొప్పున వ్యాక్సిన్ ఇస్తున్నారని, సోమవారం నుంచి వ్యాక్సిన్ డోసులు పెరుగుతాయన్నారు. 

వ్యాక్సిన్స్ సురక్షితమైనదని, 28 రోజుల తర్వాత సెకండ్ డోస్ వరల్డ్ లార్జెస్ట్ వాక్సినేషన్ భారత్‌లోనే ప్రారంభమవుతుందన్నారు. వ్యాక్సిన్‌పై అపోహలు వద్దని, హెల్త్ వర్కర్స్ కూడా అపోహతో ఉన్నారని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. వ్యాక్సిన్ సురక్షితమని.. ఎలాంటి ప్రమాదం కలగదని భరోసా ఇచ్చారు.