తాండూరు కాంగ్రెస్ అభ్యర్థి రోహిత్ రెడ్డి ఇంటింకి  సూపర్ స్టార్, తలైవా రజనీకాంత్ వచ్చారు. రోహిత్‌రెడ్డి కుమారుడి డోలారోహణ కార్యక్రమం శనివారం రాత్రి చెన్నైలో జరిగింది. మొన్నటి వరకు ఎన్నికల్లో బిజీగా ఉన్న రోహిత్‌రెడ్డి తన ఇంట్లో జరిగే శుభ కార్యక్రమంలో కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. ఈ  కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రజనీకాంత్ ని ఆహ్వానించారు. కాగా.. వారి ఆహ్వానం మేరకు అక్కడకు వచ్చిన రజనీకాంత్.. రోహిత్ రెడ్డి కుమారుడి ని ఆశీర్వదించారు.