హైదరాబాద్: మేం తలుచుకొంటే  ఇక్కడ ఎవరూ కూడ ప్రచారం చేయలేరని  తెలంగాణ రాష్ట్ర అపద్ధర్మ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటించారు.

సోమవారం నాడు  ఆయన  మీడియాతో మాట్లాడారు.తెనాలి ఎమ్మెల్యే అనుచరులు డబ్బులు పంచుతూ  దొరికారని చెప్పారు.ప్రాంతీయ విద్వేషాలను చంద్రబాబు ఎందుకు రెచ్చగొడుతున్నారో చెప్పాలని ఆయన ప్రశ్నించారు. 

సమాజానికి చంద్రబాబునాయుడు ఏం మేసేజ్ చేస్తున్నారో చెప్పాలన్నారు. ఎవరైనా వచ్చి ప్రచారం చేసే హక్కుందన్నారు. కానీ, చిల్లర రాజకీయాలు చేయకూడదన్నారు. శేరిలింగంపల్లి టీడీపీ అభ్యర్థి డబ్బుతో దొరికితే  మీడియాలో ఆయన పేరు చెప్పలేదన్నారు ఇంకా 8 మంది వద్ద డబ్బులున్నాయని తలసాని శ్రీనివాస్ యాదవ్ చెప్పారు. అక్రమాలపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని ఆయన హెచ్చరించారు.