ముందస్తు ఎన్నికలపై అలర్ట్ అయిన టీ టీడీపీ

https://static.asianetnews.com/images/authors/5daec891-66fb-5683-ad67-09c295ebe8bb.jpg
First Published 5, Sep 2018, 6:21 PM IST
t tdp alert on early elections
Highlights

తెలంగాణలో ముందస్తు ఎన్నికల అంశం రాజకీయ వేడి రాజేస్తోంది. అటు అధికార పార్టీ ఇటు ప్రతిపక్ష పార్టీ విపక్ష పార్టీలన్నీ ముందస్తు ఎన్నికలకు తాము రెడీ అంటే రెడీ అంటూ ప్రకటిస్తున్నాయి. ఇప్పటి వరకు ముందస్తు ఎన్నికలపై స్తబ్ధుగా ఉన్న టీడీపీ తాము అలెర్ట్ అయినట్లు సంకేతాలిచ్చింది. తెలంగాణ టీడీపీ సైతం ముందస్తు ఎన్నికలకు రెడీ అవుతోంది. 
 

హైదరాబాద్: తెలంగాణలో ముందస్తు ఎన్నికల అంశం రాజకీయ వేడి రాజేస్తోంది. అటు అధికార పార్టీ ఇటు ప్రతిపక్ష పార్టీ విపక్ష పార్టీలన్నీ ముందస్తు ఎన్నికలకు తాము రెడీ అంటే రెడీ అంటూ ప్రకటిస్తున్నాయి. ఇప్పటి వరకు ముందస్తు ఎన్నికలపై స్తబ్ధుగా ఉన్న టీడీపీ తాము అలెర్ట్ అయినట్లు సంకేతాలిచ్చింది. తెలంగాణ టీడీపీ సైతం ముందస్తు ఎన్నికలకు రెడీ అవుతోంది. 

ముందస్తు ఎన్నికల నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడు ఎల్ రమణ జాతీయ అధ్యక్షుడు సీఎం చంద్రబాబు నాయుడుతో చర్చించారు. ఈనేపథ్యంలో ఈనెల 8న చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో తెలంగాణ టీడీపీ నేతలతో సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో పొలిట్ బ్యూరో సభ్యులు, ప్రధాన కార్యదర్శులు పాల్గొననున్నారు. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోతోపాటు పొత్తులు, ఎన్నికల వ్యూహాలు వంటి అంశాలపై చర్చించనున్నారు. ఈనెల 8న పొత్తులు అంశంపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.    

loader