హైదరాబాద్: గవర్నర్ నియామకం భారత రాష్ట్రపతి చేతుల్లో ఉంటుందని దాన్ని రాజకీయాల్లోకి లాగడం అంత భావ్యం కాదన్నారు తెలంగాణ మంత్రి కేటీఆర్. తెలంగాణ గవర్నర్ గా తమిళ ఇసై సౌందర రాజన్ నియామకం అనేది ప్రెసిడెంట్ చేతుల్లో ఉంటుందని చెప్పుకొచ్చారు. 

భారత రాష్ట్రపతి తమిళ ఇసై సౌందర రాజన్ ను తెలంగాణ గవర్నర్ గా నియమించారని ఆమె ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారని చెప్పుకొచ్చారు. రాష్ట్ర గవర్నర్ గా ఆమెకు ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చినట్లు కేటీఆర్ స్పష్టం చేశారు. 

గవర్నర్ గా తమిళ ఇసై ప్రమాణ స్వీకారం చేసిన రోజే మంత్రి వర్గ విస్తరణ జరగడం కూడా శుభపరిణామమన్నారు. సౌందర రాజన్ మంచి వ్యక్తి అని కొనియాడారు. గవర్నర్ పదవికి ఆమె వన్నెతెస్తారని తాను ఆశిస్తున్నట్లు మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.