ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన విజయం టీఆర్ఎస్‌కు చెంపపెట్టు అన్నారు కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి. మెదక్-కరీంనగర్-ఆదిలాబాద్-నిజామాబాద్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆయన విజయం సాధించారు.

బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తనను గెలిపించినట్లే లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పట్టభద్రులు తనపై ఉంచిన నమ్మకానికి అనుగుణంగా వారి సమస్యల పరిష్కరానికి శాసనమండలిలో కృషి చేస్తామని జీవన్ రెడ్డి హామీ ఇచ్చారు.

కేసీఆర్ నియంత్రత్వ పోకడలకు ఈ ఫలితం చెంపపెట్టు వంటిదని తెలిపారు. ఈ ఎన్నికల్లో పోలైన ఓట్లలో టీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థికి కేవలం 17 శాతం మాత్రమే ఓట్లు వచ్చాయని, 83 శాతం మేధావులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు తీర్పు ఇచ్చారని పేర్కొన్నారు.