తెలంగాణలో త్వరలో జరగనున్న నాగార్జున సాగర్ ఉప ఎన్నిక నేపథ్యంలో కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ మంత్రి జానారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సాగర్‌ ఉప ఎన్నిక బరిలో తోటి అనుచరులంతా తన కుమారుడు రఘువీర్ రెడ్డిని పోటీలో ఉంచుందాం అంటే తననే నిలబెడతామన్నారు.

అలా కాదని.. తన అనుచరులు వేరే ఎవరైనా పోటీలో ఉంటాము అంటే వారికే తన మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. వారసత్వ రాజకీయాలకు తాను వ్యతిరేకం అని జానా రెడ్డి ప్రకటించారు.

Also Read:నాగార్జునసాగర్ బైపోల్: ఆ మూడు పార్టీలకు చావోరేవో, వ్యూహాత్మక అడుగులు

కాగా నాగార్జున సాగర్ స్థానం గతంలో కాంగ్రెస్‌కు కంచు కోటగా ఉండేది. కానీ గత ఎన్నికల్లో ఇక్కడ టీఆర్‌ఎస్‌ విజయం సాధించింది. నోముల నర్సింహయ్య టీఆర్‌ఎస్‌ తరఫున బరిలో నిలబడి అనూహ్య విజయం సాధించారు.

అయితే ఆయన ఆకస్మిక మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ నేపథ్యంలో ఈసారి ఇక్కడ ఒకప్పుడు వరుస విజయాలు సాధించిన జానారెడ్డిని బరిలో నిలపాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. మరోవైపు బీజేపీ ఆయన తనయుడు రఘువీర్‌ రెడ్డిని పార్టీలో చేర్చుకుని.. టికెట్‌ ఇవ్వాలని భావిస్తున్నట్లు వార్తలు వెలువడుతున్నాయి.