ఇప్పటికే వలసలతో సతమతమవుతున్న కాంగ్రెస్‌కు మరో షాక్ తగిలింది. సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి టీఆర్ఎస్‌లో చేరేందుకు రెడీ అయ్యారు. గురువారం మధ్యాహ్నం ఆయన టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో ప్రతాప్ రెడ్డి సమావేశమయ్యారు.

భేటీ అనంతరం కేటీఆర్‌ సమక్షంలో టీఆర్ఎస్‌లో చేరాలని నిర్ణయించుకున్నట్లుగా సమాచారం. డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో షాద్‌నగర్‌ నుంచి  మహాకూటమి అభ్యర్థిగా ప్రతాప్‌రెడ్డి పోటీ చేశారు.

మరోవైపు కాంగ్రెస్ నుంచి మరికొందరు ముఖ్యనేతలు బీజేపీలో చేరతారన్న ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ మాజీ ఎంపీ ఒకర, మరో అగ్రనేత తనయుడు, మాజీ మంత్రి కుమారుడి పేర్లు ప్రముఖంగా తెరపైకి వచ్చాయి. ఈ పరిణామాల దృష్ట్యా  రానున్న కాలంలో కాంగ్రెస్‌‌కు కోలుకోలేని షాక్‌లు తగిలే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లేనని విశ్లేషకులు భావిస్తున్నారు.