Asianet News TeluguAsianet News Telugu

కొత్త పీసీసీ చీఫ్ ఎంపిక: కోమటిరెడ్డికి బెస్ట్ ఆఫ్ లక్, ఉత్తమ్ లీక్‌లిస్తున్నారా..?

టీపీసీసీ చీఫ్‌గా ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడంతో అధిష్టానం కొత్త పీసీసీ అధ్యక్షుడి వేటలో పడింది. ఈ నేపథ్యంలో బుధవారం గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ సమావేశం ముగిసింది.

t congress core committee meeting ends in gandhi bhavan ksp
Author
Hyderabad, First Published Dec 9, 2020, 9:47 PM IST

టీపీసీసీ చీఫ్‌గా ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడంతో అధిష్టానం కొత్త పీసీసీ అధ్యక్షుడి వేటలో పడింది. ఈ నేపథ్యంలో బుధవారం గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ సమావేశం ముగిసింది.

టీ కాంగ్రెస్‌ ఇంచార్జ్‌ మాణికం ఠాగూర్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి, సీతక్క, శ్రీధర్‌బాబు, దామోదర రాజనర్సింహ, వీహెచ్‌, మధుయాష్కీ, పొన్నాల లక్ష్మయ్య హాజరయ్యారు. ఈ సందర్భంగా నేతలంతా కొత్త పీసీసీ అధ్యక్షుడి ఎంపికపై చర్చించారు.

కోర్‌ కమిటీ సభ్యులు తమ తమ అభిప్రాయాలను మాణికం ఠాగూర్‌కు తెలియజేశారు. సమావేశం అనంతరం కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి బెస్ట్‌ ఆఫ్‌ లక్ చెప్పారు. కోర్‌ కమిటీ సమావేశంలో తన అభిప్రాయం చెప్పలేదని, సోనియా గాంధీ ఏ నిర్ణయం తీసుకుంటే తనది అదే నిర్ణయమని ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

అంతకు ముందు మాణికం ఠాగూర్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ కోసం ఉత్తమ్‌ ఎంతో శ్రమించారని ప్రశంసించారు. దుబ్బాక ఉప ఎన్నికలో గెలుపు కోసం ఉత్తమ్‌ తీవ్రంగా కృషి చేశారని చెప్పారు.

కొత్త పీసీసీ ఎంపిక జరిగే వరకు చీఫ్‌గా ఉత్తమ్ కుమార్ రెడ్డే కొనసాగుతారని స్పష్టం ఆయన చేశారు. కాగా, పీసీసీ పదవి కోసం కోమటిరెడ్డితో పాటు రేవంత్‌ రెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి రేసులో ఉన్న సంగతి తెలిసిందే.

Follow Us:
Download App:
  • android
  • ios